Zaman Shah : దొడ్డిదారిన కోవిడ్ స్కీమ్‌ నుంచి లబ్ధి.. యూకేలో భారతీయ రెస్టారెంట్ యజమానిపై బ్యాన్

కరోనా మహమ్మారి సమయంలో ప్రజలను, వ్యాపారవేత్తలను ఆదుకోవడానికి ఆయా ప్రభుత్వాలు పలు పథకాలను ప్రవేశపెట్టి ఆర్ధికంగా చేయూతను అందించిన సంగతి తెలిసిందే.అయితే కొందరు అక్రమార్కులు ఈ నిధులను దొడ్డిదారిన కొట్టేయడానికి ప్రయత్నించారు.

 Owner Of Indian Restaurant Banned For Covid Loan Fraud In Uk-TeluguStop.com

వీరిలో పలువురు భారతీయులు కూడా వుండటం దురదృష్టకరం.ఈ క్రమంలోనే యూకే ప్రభుత్వం కోవిడ్ బౌన్స్ బ్యాక్ లోన్ నుంచి నిధులను వ్యక్తిగత లాభం కోసం ఉపయోగించిన భారతీయ రెస్టారెంట్ యజమానికి రెండేళ్ల పాటు నిషేధం విధించింది.

ఈ సమయంలో తను ఏ కంపెనీకి డైరెక్టర్‌గా వుండకూడదు.జమాన్ షా‌( Zaman Shah ) .షా వెంచర్స్ లిమిటెడ్ దక్షిణ ఇంగ్లాండ్‌లోని సాలిస్‌బరాలో చట్నీస్ ఇండియన్ టేక్ అవే ఫుడ్ రెస్టారెంట్‌ను నడుపుతున్నాడు.53 ఏళ్ల అతను తన వ్యాపారాన్ని రద్దు చేయడానికి దరఖాస్తు చేయడం ద్వారా రుణాన్ని పొందే ముందు యూకే కంపెనీ చట్టాలను ఉల్లంఘించినట్లు దర్యాప్తులో తేలింది.

Telugu Shaw, Ukinsolvency, Zaman Shah-Telugu Top Posts

ఆ నేరానికి గాను గత నెలలో వించెస్టర్ క్రౌన్ కోర్టులో( Winchester Crown Court ) .షాకు 36 వారాల జైలు శిక్ష విధించారు.అలాగే కఠినమైన షరతులతో 18 నెలల పాటు సస్పెన్షన్‌, రెండేళ్ల పాటు కంపెనీ డైరెక్టర్‌గా వుండకుండా అనర్హత వేటు పడింది.జమాన్ షా తన స్వలాభం కోసం జాతీయ అత్యవసర సమయంలో వ్యాపారాలకు సహాయం చేయడానికి ఉద్దేశించిన పథకాన్ని ఉపయోగించుకున్నాడని యూకే ఇన్‌సాల్వెన్సీ సర్వీస్ చీఫ్ ఇన్వెస్టిగేటర్ పీట్ పుల్హామ్( UK Insolvency Service Chief Investigator Pete Pulham ) అన్నారు.

ఈ చర్యలను అతను క్షణికావేశంలో చేసిన పని అని కొట్టిపారేయలేమని.వాటిని అమలు చేయాలంటే ఎన్నో వారాల ముందే ప్రణాళిక అవసరమని పీట్ వ్యాఖ్యానించారు.కోవిడ్ ఆర్ధిక సహాయాన్ని దుర్వినియోగం చేసిన డైరెక్టర్లపై చర్య తీసుకోవడానికి తాము వెనుకాడబోమని షాకు శిక్ష, అనర్హత ఉత్తర్వులే దీనికి నిదర్శనపమని ఆయన తెలిపారు.

Telugu Shaw, Ukinsolvency, Zaman Shah-Telugu Top Posts

ఫిబ్రవరి 23న జరిగిన విచారణ సందర్భంగా నెలకు 250 జీబీపీ (317 యూఎస్ డాలర్లు) చొప్పున 6000 జీబీపీ (7,614 యూఎస్ డాలర్లు) చెల్లించాలని న్యాయస్థానం షాను ఆదేశించింది.ఆయన షా వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్‌గా వున్న ఆగస్ట్ 2020లో 30,000 జీబీపీ (38,071 యూఎస్ డాలర్లు) బౌన్స్ బ్యాక్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడని కోర్టు పత్రాల్లో పేర్కొన్నారు.కంపెనీని రద్దు చేయడానికి దరఖాస్తు చేసుకున్నట్లు రుణదాతలకు తెలియజేయడానికి అతను చట్టపరమైన అంశాలను నెరవేర్చడంలో విఫలమయ్యాడని తెలిపారు.

షా .లావాదేవీలపై ఇన్‌సాల్వెన్సీ సర్వీస్ జరిపిన విశ్లేషణలో అతను తన వ్యక్తిగత ఖాతాలకు నిధులను బదిలీ చేసినట్లు తేలింది.రెమిటెన్స్ సేవను ఉపయోగించి కొంత డబ్బును విదేశాలకు పంపగా, నగదు రూపంలో పెద్ద మొత్తాన్ని ఉపసంహరించుకున్నట్లు ఇన్‌సాల్వెన్సీ సర్వీస్ తెలిపింది.ఫిబ్రవరి 2026కి ముందు కోర్టు అనుమతి లేకుండా కంపెనీ ప్రమోషన్ , స్థాపన లేదా నిర్వహణలో పాల్గొనకుండా అనర్హత వేటు వేసింది కోర్ట్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube