టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మహేష్ బాబు( Mahesh Babu ) ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా మహేష్ నటిస్తున్న గుంటూరు కారం ( Guntur Karam )సినిమాకు సంబంధించి వైరల్ అవుతున్న వార్తలు అభిమానులకు భారీ షాకిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.
ఒక ఫైట్ సీన్ ను తీసిన తర్వాత వేర్వేరు కారణాల వల్ల ఆ సీన్ ను ఈ సినిమా నుంచి తొలగించారు.
div class=”middlecontentim
ఆ ఫైట్ సీన్ కోసం మూడు కోట్ల రూపాయలు ఖర్చైందని ఆ డబ్బంతా బూడిదలో పోసిన పన్నీరేనని కామెంట్లు వినిపించాయి.ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా ఎంపికైన పూజా హెగ్డే( Pooja Hegde ) ఈ సినిమా నుంచి తప్పుకోవడం జరిగింది.సినిమా షూట్ మొదలైన ఆరు నెలల తర్వాత ఆ సినిమా నుంచి హీరోయిన్ తప్పుకోవడం ఈ సినిమా విషయంలోనే జరిగిందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. div class=”middlecontentim
అయితే తాజాగా ఈ సినిమాకు మరో షాక్ తగిలింది.ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్న పీఎస్ వినోద్( P.S.Vinod ) ఈ సినిమా నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది.ఈ సినిమాను మొదలుపెట్టిన మూహూర్తం అస్సలు బాలేదని అందువల్లే ఈ సినిమాకు ఇన్ని సమస్యలు ఎదురవుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు మహేష్ బాబు మళ్లీ వెకేషన్ కు వెళ్లారని భోగట్టా.2024 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను కచ్చితంగా రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేయాల్సి ఉంది.క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల పీఎస్ వినోద్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది.
టాలీవుడ్ లో ఒక భారీ బడ్జెట్ సినిమా నుంచి ఇంతమంది తప్పుకోవడం కేవలం గుంటూరు కారం సినిమా విషయంలో మాత్రమే జరుగుతోంది.గుంటూరు కారం సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.