ఆ సినిమా నుంచి అనుపమను తొలిగించిన హీరో.. నిజమేంటంటే!

అనుపమ పరమేశ్వరన్.మలయాళం ప్రేమమ్ సినిమాలో ఎంతో క్యూట్ గా కనిపించి అందరి మనసు దోచిన ఈ భామ తెలుగులోనూ ప్రేమమ్ సినిమాలో టీనేజర్ లా నటించి అందరి మనసు దోచింది.

 Anupama Parimeshwaran, Karthikeya 2, Priyanka Arul, Chandhu Mondeti-TeluguStop.com

ఆతర్వాత తెలుగులో నితిన్ హీరోగా సమంత హీరోయిన్ గా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ”అఆ” సినిమాలో విలన్ పాత్రలో నటించినా ఎంతో అందంగా కనిపించింది.

ఇక ఆ తర్వాత ఎంతోమంది స్టార్ హీరోలతో నటించి తెలుగులో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

ఈమె నటించిన కొన్ని సినిమాలు మంచి హిట్స్ కూడా కొట్టాయ్.ఇక అలానే మొన్న ఓ సినిమాలో అవకాశం వచ్చింది.కానీ ఆ సినిమాలో అవకాశం వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయింది.అది ఏది అంటే కార్తికేయ – 2 చిత్రం.

కొన్నేళ్ల క్రితం నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా కార్తికేయ.ఈ సినిమాలో సైన్సు, దేవుడును కలిపి తియ్యడంతో మంచి హిట్ కొట్టింది.

దీంతో దీనికి సీక్వెల్ కార్తికేయ-2 ను ప్లాన్ చేశారు.కరోనా లాక్ డౌన్ కి ముందే తెరకెక్కిన ఈ సినిమా ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసింది.

ఇక ఈ నెల నుంచి మళ్లీ సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అయ్యింది.

అయితే ఏమైందో తెలియదు కానీ అనుపమను హీరోయిన్ గా కార్తికేయ – 2 సినిమా కోసం మొదట అనుకున్నప్పటికీ కరోనా కారణంగా షెడ్యూల్ ఎఫెక్ట్ అయ్యి ఈ సినిమా నుంచి తప్పుకుందని వార్తలు వచ్చాయ్.

మరో వైపు యూనిట్ ఏ వద్దు అనుకోని తీసేసిందని వార్తలు వచ్చాయి.కానీ ఈ సినిమాలో ఆమె లేకుండా పోవటానికి ఓ హీరో పెద్ద కథే నడిపాడట.

అనుపమతో ఓ హీరోకి పరిచయం చెడిందని.అందుకే ప్లాన్ ప్రకారం ఆమెను సినిమా నుంచి బయటకు పంపినట్టు వార్తలు వస్తున్నాయ్.

ఆ వార్తల్లో ఎంత నిజం ఉందనేది తెలియదు కానీ ఆమె ఆ సినిమా నుంచి తప్పుకుందని.ఆ పాత్రలో గ్యాంగ్ లీడర్ ఫెమ్ ప్రియాంక అరుళ్ ని పెట్టినట్టు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube