అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి కరపత్రాల కలకలం చెలరేగింది.ఎమ్మెల్యే పెద్దారెడ్డికి వ్యతిరేకంగా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు కరపత్రాలను పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యే పెద్దారెడ్డి అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారని, నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే జూద కేంద్రంగా మార్చారని కరపత్రాలలో ఆరోపించారు.మట్కా, క్రికెట్ బెట్టింగ్ తో పాటు గంజాయి విక్రయాల వెనుక ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఉన్నారంటూ కరపత్రాలలో పేర్కొన్నారు.
దీంతో తీవ్ర కలకలం చెలరేగింది.