దేశంలో మరోసారి విపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ అంటూ తీవ్ర కలకలం చెలరేగింది.విపక్ష పార్టీలకు చెందిన నాయకుల ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
ఈ క్రమంలో ఫోన్ల హ్యాకింగ్ పై కేంద్రం సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.అయితే ఇటువంటి ఫోన్ ట్యాపింగ్ లకు భయపడేది లేదన్నారు.
మరోవైపు ఆపిల్ సంస్థ పలువురు నేతలకు ఫోన్లు హ్యాక్ అవుతున్నాయంటూ మెయిల్ పంపింది.కాగా ఆపిల్ సంస్థ నుంచి ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కేసీ వేణుగోపాల్, అఖిలేష్ యాదవ్ తో పాటు సీతారాం ఏచూరి వంటి నేతలకు అలర్ట్ మెయిల్ వచ్చింది.
దీంతో ఈ ఫోన్ ట్యాపింగ్ ఘటనతో దేశంలో పెద్ద ఎత్తున దూమారం రేగుతోంది.