యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మెజారిటీ శాతం పూర్తి కావడంతో ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా చూస్తున్నారు.
ఇక ఈ సినిమాను రిలీజ్ చేయకముందే తారక్ తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.ఈ సినిమాను ఇప్పటికే ప్రారంభించిన సంగతి తెలిసిందే.
అయితే ఆర్ఆర్ఆర్ కోసం ఏకంగా రెండేళ్ల పాటు ఒక్క సినిమాను కూడా రిలీజ్ చేయని తారక్, ఆర్ఆర్ఆర్ను 2021 సంక్రాంతి బరిలో దించేందుకు సిద్ధమయ్యాడు.అటు తన 30వ చిత్రాన్ని కూడా అదే సంవత్సరంలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.ఇప్పటికే త్రివిక్రమ్‌తో తన సినిమాను అనౌన్స్ చేసిన తారక్, ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా ప్రారంభించాలని చూస్తున్నాడు.2021 చివరినాటికి ఈ సినిమాను రిలీజ్ చేయాలని తారక్ ఫ్యాన్స్ కూడా ఆశిస్తున్నారు.అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది సాధ్యపడేలా కనిపించడం లేదని చిత్ర వర్గలు అంటున్నాయి.
ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ఎలాగోలా సంక్రాంతి బరిలో రిలీజ్ చేసినా, త్రివిక్రమ్ సినిమాను మాత్రం అనుకున్న సమయంలో పూర్తి చేయడం కుదరకపోవచ్చని, దీంతో ఈ సినిమాను 2021లో రిలీజ్ చేయడం అసలే సాధ్యం కాదని చిత్ర వర్గాలు అంటున్నాయి.
మరి త్రివిక్రమ్‌తో తెరకెక్కే చిత్రాన్ని తారక్ ఎప్పుడు రిలీజ్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.