ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కావడానికి మరో 20 రోజుల సమయం మాత్రమే ఉంది.ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది.
ఇప్పటికే నాలుగుసార్లు ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ డేట్ మారగా మార్చి 25వ తేదీన ఈ సినిమా రిలీజ్ కావడానికి ఎటువంటి ఇబ్బందులు లేవు.నిర్మాత డీవీవీ దానయ్య మొదట 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ మూవీని నిర్మించాలని అనుకున్నారు.
అయితే కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల వడ్డీల భారం పెరిగి ఆర్ఆర్ఆర్ నిర్మాత ఈ సినిమా కోసం ఏకంగా 500 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.అయితే రాజమౌళికి ఉన్న క్రేజ్ వల్ల ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు కళ్లు చెదిరే రేటుకు అమ్ముడయ్యాయి.
ఆర్ఆర్ఆర్ మూవీ నాన్ థియేట్రికల్ హక్కుల విలువ ఏకంగా 225 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.
నిర్మాత ఈ సినిమాకు సంబంధించి తెలుగు రాష్ట్రాల హక్కులను, కర్ణాటక హక్కులను, ఓవర్సీస్, ఇతర ఏరియాల హక్కులను విక్రయించారని ఈ హక్కులతో కలిపి బడ్జెట్ రికవరీ అయిందని స్వల్పంగా లాభాలు వచ్చాయని సమాచారం.
హిందీలో ఆర్ఆర్ఆర్ హక్కులను విక్రయించలేదని హిందీలో వచ్చే కలెక్షన్లు మాత్రమే నిర్మాతకు లాభంగా మిగులుతాయని సమాచారం అందుతోంది.ఆర్ఆర్ఆర్ రిలీజ్ సమయానికి ఏపీలో టికెట్ రేట్ల జీవో కూడా అమలులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
ఏపీలో టికెట్ రేట్లు పెరిగితే మాత్రమే ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలకు కళ్లు చెదిరే కలెక్షన్లు రావడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు.ఎన్టీఆర్, రామ్ చరణ్ దాదాపుగా మూడేళ్ల పాటు ఈ సినిమాకు పరిమితమయ్యారు.ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్టీఆర్, చరణ్ ఆశ పడుతుండగా ఆర్ఆర్ఆర్ మూవీ యునానిమస్ గా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రమే ఈ హీరోల కల నెరవేరుతుందని చెప్పవచ్చు.