యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”ఎన్టీఆర్30”. ఈ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.ఎందుకంటే త్రిపుల్ ఆర్ సినిమాతో భారీ స్టార్ డమ్ అందుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా వెలుగొందు తున్నాడు.
ఈ సినిమా ఇచ్చిన హిట్ తో ఎన్టీఆర్ ఆ తర్వాత సినిమాలన్నీ పాన్ ఇండియా వ్యాప్తంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.ఈ క్రమంలోనే తన 30వ సినిమాను కొరటాల దర్శకత్వంలో ఫిక్స్ చేసాడు.
అయితే ఈ సినిమా ప్రకటించి కూడా ఏడాదికి పైగానే అవుతుంది.అయినా కూడా ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లలేక పోయాడు.

ఇక ఈ సినిమా షూట్ స్టార్ట్ కాకుండానే రిలీజ్ డేట్ ప్రకటించారు.ఈ సినిమా వచ్చే ఏడాది 2024లో ఉంటుంది అని మార్చి నుండి షూట్ స్టార్ట్ కాబోతుంది అని అధికారికంగా ప్రకటన వచ్చింది.ఇదిలా ఉండగా ఈ సినిమా షూట్ స్టార్ట్ కాకపోయినా ఏదొక వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ రూమర్ వినిపిస్తుంది.

ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ మాత్రమే కాదట.భారీగా సెట్టింగ్స్ కూడా ఉన్నాయని అంటున్నారు.ఈ సినిమా కోసం మేకర్స్ భారీ స్థాయిలో సెట్టింగ్స్ ను సిద్ధం చేయిస్తున్నారని టాక్.ఇలా భారీ క్యాస్టింగ్ కోసమే కాదు.భారీ సెట్టింగ్స్ కు కూడా నిర్మాతలు భారీగానే ఖర్చు చేస్తున్నారు.పాన్ ఇండియన్ మూవీ కాబట్టి ఎక్కడ తగ్గకుండా యువ సుధా ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు భారీగా ఖర్చు చేయడానికి సిద్ధం అయ్యారు.
చూడాలి ఈ సినిమా నుండి అఫిషియల్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో.