యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) ప్రస్తుతం తాను నటిస్తున్నటువంటి దేవర ( Devara ) సినిమాకు చిన్న బ్రేక్ ఇచ్చారని తెలుస్తుంది.ఈ విధంగా ఎన్టీఆర్ ఈ సినిమాకు బ్రేక్ ఇచ్చి ఉన్నఫలంగా దుబాయ్ వెళ్లారు.
ఇలా తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లడానికి కారణం ఏంటి అనే విషయం గురించి చర్చలు మొదలయ్యాయి.ఇక్కడ మావయ్య అరెస్టు కావడంతో అల్లుడు ఇలా దుబాయ్ వెళ్లడం ఏంటి అంటూ పలువురు ఎన్టీఆర్ దుబాయ్ పర్యటన పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే వెకేషన్ కోసం ఎన్టీఆర్ దుబాయ్ వెళ్లలేదని తెలుస్తుంది.
ఈ నెల 15 16 తేదీలలో సైమా ( SIIMA Awards 2023 ) – సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుకలు దుబాయ్ ( Dubai )లో జరుగుతాయి.వాటిలో పాల్గొనడానికి ఎన్టీఆర్ వెళ్లారని తెలుస్తోంది.ఈ అవార్డు వేడుకలలో భాగంగా ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్( RRR ) సినిమాకి గాను బెస్ట్ యాక్టర్( Best Actor ) అవార్డు అందుకోబోతున్నారని అందుకే ఈయన ఈ అవార్డు వేడుకకు హాజరు కావడం కోసమే దుబాయ్ వెళ్లారని తెలుస్తుంది.ప్రస్తుతం ఎన్టీఆర్ దుబాయ్ వెళ్లడం కోసం ఎయిర్ పోర్ట్ లోసందడి చేసినటువంటి ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఈ విధంగా సైమా అవార్డు వేడుకలలో భాగంగా ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకోబోతున్నారన్న విషయం తెలియడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమాలో కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ ఎంతో అద్భుతంగా నటించారు.ఇలా ఎన్టీఆర్ నటనకు గాను ఈయన ఖాతాలో సైమా అవార్డు వచ్చి చేరిందన్న విషయం తెలియడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే గత మూడు రోజులుగా చంద్రబాబు నాయుడు విషయంలో ఎన్టీఆర్ మౌనంగా ఉండడంతో ఈయనపై పలువురు తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఇలా తన పట్ల విమర్శలు వస్తున్నప్పటికీ కూడా ఎన్టీఆర్ ఈ విషయంలో మౌనంగా ఉండటం గమనార్హం.
.