జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి అనిల్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.పవన్ కల్యాణ్ టీడీపీ నేతలా మాట్లాడుతున్నారని విమర్శించారు.
రూ.371 కోట్ల స్కాంలో చంద్రబాబు జైలుకు వెళ్తే స్వాతంత్య్ర ఉద్యమం చేసి అరెస్ట్ అయినట్లు చేస్తున్నారని మాజీ మంత్రి అనిల్ ఎద్దేవా చేశారు.ఒక పార్టీ నాయకుడు కోసం మరొక పార్టీ నాయకుడు రోడ్డుపై పడుకుని నిరసన చేసిన ఘటన యావత్ ప్రపంచంలో తొలిసారిగా జరిగిందని తెలిపారు.జనసేన, టీడీపీ కలిసి వచ్చినా ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీనే మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.







