ఆయన మెంటల్ కండీషన్ బాగానే వుందా : ట్రంప్‌పై ‌నిక్కీహేలీ వ్యాఖ్యలు

భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నేత నిక్కీ హేలీ( Republic Leader Nikki Haley ) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై విరుచుకుపడ్డారు.మాజీ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ పేరు విషయంలో గందరగోళానికి గురవ్వడంతో ట్రంప్ మానసిక పరిస్ధితి బాగానే వుందా అంటూ నిక్కీ ప్రశ్నలు లేవనెత్తారు.

 Nikki Haley Raises Concerns Over Trump's 'mental Fitness' After He 'confuses' He-TeluguStop.com

ఈ మేరకు ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో వీడియో పోస్ట్ చేశారు.కేపిటల్ హిల్స్ అల్లర్ల గురించి చెబుతూ ట్రంప్ గందరగోళానికి గురయ్యాడని.

అసలు విషయాన్ని పక్కకుపెట్టాడని ఆమె దుయ్యబట్టారు.నాన్సీపెలోసీ( Nancy Pelosi ) గురించి మాట్లాడుతూ తన పేరును పదే పదే ప్రస్తావించారని నిక్కీ ఎద్దేవా చేశారు.

Telugu Donald Trump, Nancy Pelosi, Nikki Haley, Republican, Presidential-Telugu

అమెరికా అధ్యక్షుడి హోదాలో వున్న వారు తీవ్రమైన ఒత్తిడి మధ్య పనిచేయాలని, మానసికంగా దృఢంగా వుండాలని నిక్కీ హేలీ హితవు పలికారు.తాను అవమానకరంగా ఏమీ అనడం లేదని, కానీ మీరు (ట్రంప్ ) అధ్యక్ష పదవిని ఒత్తిళ్ల మధ్య నిర్వహిస్తున్నప్పుడు.మరోసారి పదవిని చేపట్టడానికి మానసికంగా సిద్ధంగా వున్నారా అనేదే తన ప్రశ్న అన్నారు.ది హిల్ వార్తాసంస్ధ కథనం ప్రకారం.ట్రంప్( Donald Trump ) శుక్రవారం నిర్వహించిన ర్యాలీలో యూఎస్ కేపిటల్‌లో జనవరి 6న జరిగిన అల్లర్ల గురించి ప్రస్తావించారు.ఈ సందర్భంగా నిక్కీ హేలీ, హౌస్ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Telugu Donald Trump, Nancy Pelosi, Nikki Haley, Republican, Presidential-Telugu

నిక్కీ హేలీ జనవరి 6కు సంబంధించిన సమాచారాన్ని ధ్వంసం చేశారని ట్రంప్ వ్యాఖ్యానించారు.కేపిటల్ హిల్ భద్రతను నిక్కీ హేలీ పర్యవేక్షించాలని, మేము ఆమెకు 10 వేల మంది సైనికులను, నేషనల్ గార్డులను, కోరుకున్న వాటిని అందించామని అయినప్పటికీ వారు దానిని తిరస్కరించారని ట్రంప్ అన్నారు.వాస్తవానికి అక్కడ ప్రస్తావించాల్సింది అప్పటి యూఎస్ ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ గురించి.కానీ ట్రంప్ మాత్రం పదే పదే నిక్కీ హేలీ పేరును తలచుకోవడం దుమారం రేపింది.

ఈ క్రమంలోనే నిక్కీ ఆయనకు కౌంటర్ ఇచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube