ఆ ఒక్క కారణంతోనే స్పై రిలీజ్ వద్దని చెప్పా... నిఖిల్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్( Nikhil ) తాజాగా స్పై చిత్రం(Spy Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఈయన నటించిన గత చిత్రాలు కార్తికేయ2, 18 పేజెస్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నాయి.

 Hero Nikhil Comments About Spy Release,nikhil, Spy Movie, Spy Movie Trailer Vau-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈయన తదుపరిచిత్రం స్పై చిత్రాన్ని కూడా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ఘనంగా విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి.అయితే ఈ సినిమా విడుదల విషయంలో హీరో నిఖిల్ నిర్మాత మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని వార్తలు వినిపించాయి.

ఈ సినిమా విడుదల తేదీని నిర్మాత ప్రకటించారు.అయితే ఆరోజు సినిమా విడుదల చేయకూడదంటూ నిఖిల్ చెప్పినప్పటికీ నిర్మాత వినలేదని ఆ విషయం గురించి ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయని తెలుస్తుంది.


Telugu Nikhil, Spy-Movie

ఈ విధంగా ఇద్దరికీ భేదాభిప్రాయాలు రావడంతో నిఖిల్ ఈ సినిమా ప్రమోషన్లకు కూడా దూరంగా ఉండబోతున్నారని భావించారు.కానీ తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ( Spy Trailer) విడుదల చేశారు.ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో హీరో నిఖిల్ కూడా పాల్గొన్నారు.ఈ సినిమా స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ( Subash Chandrabose ) మరణ మిస్టరీ కి సంబంధించిన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఇక ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి ట్రైలర్ అభిమానులలో భారీగా అంచనాలను పెంచేసింది.


Telugu Nikhil, Spy-Movie

ఇక నిర్మాతకు హీరో నిఖిల్ కి మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈ వార్తలపై హీరో నిఖిల్ స్పందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సినిమా విడుదల విషయంలో నా బాధంతా ఒకటేనని తెలిపారు.ప్రస్తుతం సినిమా టికెట్ల రేట్లు మినిమం 200 నుంచి 250 వరకు పెరిగిపోయాయి.

అవుట్ ఫుట్ కూడా ఆదరణ మ్యాచ్ చేసే విధంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ సినిమాను మరికొన్ని రోజులు వాయిదా వేయాలని చెప్పానని ఈ సందర్భంగా నిఖిల్ తెలియజేశారు.కొన్ని రోజుల క్రితం ఈ సినిమాని నేను చూసినప్పుడు చాలా వర్క్ పెండింగ్ ఉంది.

దాదాపు 200 మంది చేయాల్సిన విఎఫ్ఎక్స్ పనులను 2000 మంది పనిచేసారని ఈ ఒక్క సినిమా కోసమే అయిదారు విఎఫ్ఎక్స్ కంపెనీలు పని చేయటంతో ఇంత సక్సెస్ ఫుల్ గా సినిమాని విడుదల చేయగలుగుతున్నాం అంటూ ఈయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube