జర్నలిస్టులకు అదిరిపోయే న్యూస్.. గూగుల్ నుంచి కొత్త ఏఐ టూల్ త్వరలోనే లాంచ్!

చాట్‌జీపీటీ ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఏలుతున్న వేళ టెక్ దిగ్గజం గూగుల్( Google ) దానికి పోటీగా నిలవాలని ప్రయత్నిస్తోంది.ఆల్రెడీ దానికి ప్రత్యక్ష పోటీగా గూగుల్ బార్డ్ ఏఐ చాట్‌బాట్‌ను పరిచయం చేసింది.

 News That Is Overwhelming For Journalists A New Ai Tool From Google Will Be Lau-TeluguStop.com

ఆ ఒక్క ఏఐ టూల్‌తోనే గూగుల్ సరిపెట్టుకోలేదు.అన్ని రంగాల్లో అందరికీ హెల్ప్ అయ్యే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ పరిచయం చేయాలని ఆలోచిస్తోంది.

ప్రస్తుతం జర్నలిస్టుల కోసం ఒక ఏఐ సాధనం తీసుకురావాలని యోచిస్తోంది.

Telugu Ai Tool, Genesis, Google, Journalism-Technology Telugu

గూగుల్ ఇప్పుడు ‘జెనెసిస్( Genesis )’ అనే ప్రత్యేక ఏఐ టూల్ తీసుకువచ్చే పనిలో పడింది.దీని గురించి ది వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ వంటి పెద్ద వార్తా సంస్థలతో మాట్లాడటం కూడా ప్రారంభించింది.ఈ సాధనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌( Artificial intelligence )ని ఉపయోగిస్తుంది, ఇది స్మార్ట్ కంప్యూటర్ టెక్నాలజీ లాంటిది, జర్నలిస్టులు న్యూస్ ఆర్టికల్స్ రాయడంలో సహాయం చేస్తుంది.

ఈ ఏఐ టూల్ వాస్తవాలు, సమాచారంతో ఆర్టికల్స్ చాలా గొప్పగా క్రియేట్ చేయగలదు.అయితే కచ్చితమైన, మంచి వార్తల కథనాలను రూపొందించడానికి ఎంత కృషి చేయాలో అది పూర్తిగా అర్థం చేసుకోగలదా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మరికొందరు ఇది జర్నలిస్టులకు సహాయపడే ఒక అసిస్టెంట్ అవుతుందని భావిస్తారు.

Telugu Ai Tool, Genesis, Google, Journalism-Technology Telugu

ఈ కొత్త ఏఐతో జర్నలిస్టులకు, ప్రత్యేకించి చిన్న వార్తా సంస్థలతో పనిచేసే వారికి, వారి ఆర్టికల్స్ కోసం ఎంపికలు, ఆలోచనలను అందించాలి గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది.వారికి హెడ్‌లైన్స్ లేదా విభిన్న లైటింగ్ స్టైల్స్ సూచించడం ద్వారా గూగుల్ సహాయం చేయాలనుకుంటోంది.అయితే ఈ సాధనం జర్నలిస్టులను భర్తీ చేయడానికి ఉద్దేశించినది కాదని గూగుల్ స్పష్టం చేయాలనుకుంటోంది.

జర్నలిస్టులు ఇప్పటికీ చాలా ముఖ్యమైనవారు.ఎందుకంటే వారు వాస్తవాలను చెక్ చేస్తారు.

వార్తలు నమ్మదగినవిగా ఉండేలా చూసుకుంటారు.కొన్నిసార్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తప్పుడు సమాచారాన్ని అందించవచ్చు, కాబట్టి గూగుల్ జాగ్రత్తగా ఉంటుంది.

భర్తీ చేయకుండా జర్నలిస్టులకు సహాయపడే సాధనాలను రూపొందించడానికి వార్తా కంపెనీలతో కలిసి పని చేయాలనుకుంటోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube