Pawan Kalyan : పవన్ తో స్నేహం వల్ల త్రివిక్రమ్ కు ఇన్ని రూ.కోట్ల లాభమా.. ఆ రేంజ్ లో సంపాదిస్తున్నారా?

టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan kalyan ) గురించి మనందరికీ తెలిసిందే.ఆయనకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి కూడా మనందరికీ తెలిసిందే.

 Trivikram Gets A Record Remuneration For Pawan Kalyan Movies-TeluguStop.com

రెండు తెలుగు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ కు భారీగా అభిమానులు ఉన్నారు.కానీ పవన్ కళ్యాణ్ కు ఇండస్ట్రీలో ఉన్న స్నేహితులు సన్నిహితులు మాత్రం చాలా తక్కువ అని చెప్పవచ్చు.

పవన్ కళ్యాణ్ కు బాగా దగ్గరైన వారిలో అలీ,త్రివిక్రమ్ శ్రీనివాస్ ల పేర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి.ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల పలు కారణాల వల్ల అలీ పవన్ మధ్య గ్యాప్ వచ్చింది.

Telugu Bro, Pawan Kalyan, Pawan, Tollywood-Movie

దాంతో కొద్ది కాలంగా పవన్ పక్కన త్రివిక్రమ్( Trivikram srinivas ) తప్ప ఇంకెవరూ కనిపించడం లేదు.ఆ మధ్య యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ తనను తాను పవన్ భక్తుడిగా చెప్పుకునే బండ్ల గణేష్ కూడా సైడ్ అయిపోయాడు.త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ తో సన్నిహితంగా స్నేహితుడిగా ఉండడంతో పాటు డైరెక్టర్ గా ఎన్నో సినిమాలు కూడా తెరకెక్కించిన విషయం తెలిసిందే.జల్సా, అత్తారింటికి దారేది,( Attarintiki Daredi ) అజ్ఞాతవాసి లాంటి సినిమాలను రూపొందించాడు.

వీరిద్దరు కలిసి పని చెయ్యకపోయినా కానీ పవన్ నటించే కొన్ని సినిమాల విషయంలో నేరుగా త్రివిక్రమ్ హస్తం ఉంటుంది.పవన్ కళ్యాణ్ నటించిన ఆఖరి సినిమా భీమ్లానాయక్.

Telugu Bro, Pawan Kalyan, Pawan, Tollywood-Movie

గత ఏడాది విడుదలైన ఈ మూవీకి సాగర్ కె.చంద్ర డైరెక్టర్ అయినప్పటికీ తను టైటిల్స్ వరకు పరిమితమయ్యాడు.ప్రాజెక్ట్ సెట్ చేయడం, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాయడం అంతా త్రివిక్రమే.ఇప్పుడు బ్రో సినిమా( Bro movie ) విషయంలో కూడా త్రివిక్రమ్ హస్తం ఉందని తెలుస్తోంది.

పేరుకి మాత్రం సముద్రఖని దర్శకుడు.దీనికి కూడా స్క్రీన్‌ప్లే, మాటలు గురూజీనే.

సముద్రఖని తమిళంలో మంచి నటుడు, దర్శకుడిగానూ గుర్తింపు పొందారు.ఇక తను డైరెక్షన్ చేయకపోయినా పవన్ సినిమాలకు దర్శకత్వ పర్యవేక్షణ మాత్రం ఆయనదే.

అలాగే పవన్ వరుసగా రీమేక్స్ చేయడానికి కారణం, పవన్ ఏ సినిమా చెయ్యాలి? ఎవరితో సినిమా చేయాలి? హీరోయిన్ ఎవరు? మిగతా కీలక నిర్ణయాలన్నీ గురూజీ త్రివిక్రమ్ వేనట.ఇలా ప్రాజెక్ట్‌లో ఇన్‌వాల్వ్ అయినందుకు త్రివిక్రమ్‌కు భారీగానే ముట్టజెప్పాలట.ఒక్కో సినిమాకిగానూ రూ.15-20 కోట్ల వరకు అందుకుంటున్నాడని టాక్.ఆయన డైరెక్షన్ చేసే సినిమాలకైతే అక్షరాలా రూ.50 కోట్ల పారితోషికం, లాభాల్లో వాటాల వంటివి కూడా తీసుకుంటున్నాడని అంటున్నారు.ఈ రకంగా పవన్ కళ్యాణ్‌ తో స్నేహం గురూజీకి కోట్లు కురిపిస్తుందనే చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube