వర్షాకాలంలో ఇండియాలో తప్పక చూడాల్సిన 5 బెస్ట్ ప్లేసెస్..!

భారతదేశం విభిన్న ప్రకృతి ప్రదేశాలతో అందమైన దేశంగా నిలుస్తోంది.వర్షాకాలం( Monsoon ) వీటికి మరింత ప్రత్యేక ఆకర్షణను తెచ్చిపెడుతుంది.

 5 Must-visit Destinations In India During Monsoon Details, India, Monsoon Travel-TeluguStop.com

ఈ సమయంలో ఆ ప్రాంతాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తే వచ్చే అనుభూతే వేరు.ముఖ్యంగా ఐదు ప్రాంతాలు ప్రజలకు మరపురాని జ్ఞాపకాలను మిగుల్చుతాయి.అవేవో చూసేద్దామా మరి.

• జిరో వ్యాలీ:

Telugu Adventure, Agumbe, Athirapally, Cherrapunji, Dzkou Valley, India, Karnata

అరుణాచల్ ప్రదేశ్‌లోని జిరో వ్యాలీ (Ziro Valley) వర్షాకాలంలో ఒక స్వర్గధామంగా మారుతుంది.అక్కడి పచ్చదనం, వెదురు అడవులు, టెర్రస్డ్ వరి పొలాలు మంత్రముగ్దుల్ని చేస్తాయి.పర్యాటకులు చిరుతపులి వంటి వన్యప్రాణులను చూడటానికి సమీపంలోని టాలీ వన్యప్రాణుల అభయారణ్యానికి కూడా వెళ్లవచ్చు.

• అతిరాపల్లి:

Telugu Adventure, Agumbe, Athirapally, Cherrapunji, Dzkou Valley, India, Karnata

కేరళలోని అతిరాపల్లి జలపాతాన్ని (Athirapally Falls) “భారతదేశ నయాగరా” అని పిలుస్తారు.దట్టమైన అడవుల నడుమ ఉన్న ఈ అద్భుతమైన జలపాతం ఒక ప్రకృతి అద్భుతం.సందర్శకులు ఈ ప్రాంతంలో చిరుతపులులు, ఏనుగులు వంటి అడవి జంతువులను కూడా చూడవచ్చు.

• డ్జుకౌ వ్యాలీ:

Telugu Adventure, Agumbe, Athirapally, Cherrapunji, Dzkou Valley, India, Karnata

నాగాలాండ్-మణిపూర్ సరిహద్దులో ఉన్న డ్జుకౌ లోయ (Dzükou Valley)ను “వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్” అని కూడా అంటారు.ఇది వర్షాకాలంలో పచ్చదనాన్ని చీర కట్టుకుంటుంది.ఈ ప్రదేశం వికసించే పూలతో అద్భుత టూరిస్ట్ డెస్టినేషన్‌గా మారుతుంది.ట్రెక్కింగ్‌కు కూడా బెస్ట్ ప్లేస్‌గా ఉంటుంది.

• చిరపుంజి:

Telugu Adventure, Agumbe, Athirapally, Cherrapunji, Dzkou Valley, India, Karnata

మేఘాలయలోని చిరపుంజి (Cherrapunji)లో వర్షాకాలం అంతటా భారీ వానలు కురుస్తాయి.అందుకే ఆ కాలంలో చిరపుంజి పచ్చదనం కప్పుకుని ఉంటుంది.అలానే భూమిపై అత్యంత తేమగా ఉండే ప్రదేశాలలో ఒకటిగా మారుతుంది.ఇది చెట్ల వేర్లు, అద్భుతమైన నోహ్కాలికై జలపాతం, జీవన రూట్ వంతెనలను కలిగి ఉంది.

• అగుంబే:

Telugu Adventure, Agumbe, Athirapally, Cherrapunji, Dzkou Valley, India, Karnata

కర్నాటకలోని అగుంబే (Agumbe) ఆకర్షణీయమైన ప్రకృతి దృశ్యాలు, దట్టమైన అడవులు, భారీ జలపాతాలకు నెలవు.ఇది జీవవైవిధ్యంతో ఉంటుంది.ప్రకృతి అందాలను అన్వేషించడానికి గొప్ప ప్రదేశంగా నిలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube