సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు ఇతర సినిమాలతో పోల్చి చూస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.స్టార్ హీరోల సినిమాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు సైతం చూసీచూడనట్లు వ్యవహరిస్తూ ఉంటాయి.
అయితే హీరో విజయ్( Hero Vijay ) సినిమాల విషయంలో మాత్రం ఇందుకు భిన్నంగా జరుగుతోంది.వేర్వేరు కారణాల వల్ల చాలా సందర్భాల్లో విజయ్ సినిమాలు వివాదాలలో చిక్కుకోవడం జరిగింది.
ఆ వివాదాలు కొన్నిసార్లు సులువుగానే పరిష్కారమయ్యాయి.
విజయ్ ప్రస్తుతం పొలిటికల్ ఎంట్రీ దిశగా అడుగులు వేస్తున్నారు.
కేవలం రెండు సినిమాలలో మాత్రమే నటించి సినిమాలకు గుడ్ బై చెబుతానని ప్రకటించిన విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు డైరెక్షన్ లో నటిస్తున్నారు.ఈ సినిమా గోట్ ( GOAT ) అనే టైటిల్ తో తెరకెక్కుతుండగా ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
ఈ సినిమా నుంచి తాజాగా విజిల్ పోడు అనే సాంగ్ రిలీజ్ కాగా ఈ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా సెప్టెంబర్ నెల 5వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.అయితే విజిల్ పోడు సాంగ్ లో( Whistle Podu Song ) పొగ త్రాగడం, మద్యం సేవించడంను ప్రొత్సహించే షాట్స్ ఉన్నాయంటూ ఆన్ లైన్ ద్వారా ఒక వ్యక్తి చెన్నై డీఐజీ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు.ఈ ఆన్ లైన్ ఫిర్యాదు విషయంలో డీఐజీ చర్యలు తీసుకుంటారో లేదో చూడాల్సి ఉంది.
గతంలో విజయ్ నటించిన తలైవా, కత్తి సినిమాలకు సమస్యలు రాగా రాజకీయ రంగ ప్రవేశం చేస్తుండటం వల్లే విజయ్ సినిమాలకు ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఆయన అభిమానులు ఫీలవుతున్నారు.ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీన రిలీజ్ కానుండటంతో ఆ సమయానికి ఈ సమస్య పరిష్కారమయ్యే ఛాన్స్ ఉంది.ఈ ఫిర్యాదు విషయంలో విజయ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.