ఛత్తీస్ గఢ్( Chhattisgarh ) లోని కాంకేరర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్తో ఏజెన్సీ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు.ఛోట్ బెటియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బినాగుండా, కరోనార్ మధ్య హపటోలా అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
ఈ కాల్పుల్లో సుమారు 29 మందికి పైగా నక్సలైట్లు మరణించినట్లు సమాచారం.ఈ క్రమంలోనే కాంకేర్ ఎన్కౌంటర్ను ఛత్తీస్ గఢ్ చరిత్రలోనే అతిపెద్ద ఎన్కౌంటర్( Encounter )గా పోలీసులు పేర్కొంటున్నారు.
కాగా బస్తర్( Bastar ) లో సుమారు నాలుగు నెలల వ్యవధిలో 79 మంది మావోయిస్టులు మృతిచెందారని సమాచారం.ఈ నేపథ్యంలోనే మావోయిస్టుల సమాచారం అందించిన వారికి ఉద్యోగం, రూ.5 లక్షల నగదును ఛత్తీస్ గఢ్ పోలీసులు ప్రకటించారు.