టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన నాగచైతన్య( Naga Chaitanya ) స్టార్ హీరోయిన్ సాయిపల్లవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తండేల్ మూవీ దసరాకు విడుదలవుతుందని మొదట వార్తలు వచ్చాయి.అయితే దసరా పండుగకు ఇప్పటికే ఎక్కువ సంఖ్యలో సినిమాలు షెడ్యూల్ అయిన నేపథ్యంలో తండేల్ మూవీ( Thandel Movie ) రిలీజ్ డేట్ మారిందని తెలుస్తోంది.
డిసెంబర్ నెల 20వ తేదీన క్రిస్మస్ పండుగ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారని సమాచారం అందుతోంది.టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున( Nagarjuna )కు డిసెంబర్ నెల అచ్చొచ్చిన నెల అనే సంగతి తెలిసిందే.
డిసెంబర్ నెల( December )లో విడుదలైన నాగ్ సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించిన నేపథ్యంలో నాగచైతన్యకు కూడా ఆ సెంటిమెంట్ కలిసొస్తుందేమో చూడాల్సి ఉంది.తండేల్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే నాగచైతన్య మార్కెట్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
తండేల్ మూవీ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుండగా 80 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.దర్శకుడు చందూ మొండేటి( Director Chandoo Mondeti ) మీద ఉన్న నమ్మకంతో నిర్మాతలు ఈ సినిమాపై ఈ స్థాయిలో ఖర్చు పెడుతున్నారు.చైతన్య ఈ సినిమాలో మత్స్యకారుని పాత్రలో కనిపించనున్నారు.శ్రీకాకుళం యాసలో చైతన్య డైలాగ్ డెలివరీ వేరే లెవెల్ లో ఉంటుందని తెలుస్తోంది.
వరుస ఫ్లాపుల వల్ల నాగచైతన్య మార్కెట్ తగ్గినా తండేల్ సినిమాతో చైతన్య రేంజ్ మారిపోతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.తండేల్ సినిమాలో యాక్షన్ సీన్స్( Action Scenes ) కూడా స్పెషల్ గా ఉంటాయని తెలుస్తోంది.రియల్ ఇన్సిడెంట్ల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.తండేల్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాలి.
ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.