అతి త్వరలో మార్కెట్ లోకి కొత్త కలర్ టమాటా లు..!

టమాటా లేని కూరను ఉహించుకోవాలంటేనే చాలా కష్టం కదా ఎందుకంటే టొమోటో లేనిదో కూర వండబుద్ది కాదు.చూస్తానికి ఎరుపుగా నిగనిగాలాడుతూ కనిపించే టమోటోను చూస్తే నోరు ఉరిపోతుంది.

 New Color Tomatoes Into The Market Very Soon Markets, Tamotos, Latest News, Vira-TeluguStop.com

కూరల్లో రుచిని ఇవ్వడంతో పాటు కూరకు మంచి ఆకర్షనియమైన టెక్చర్ ను కూడా టమోటో ఇస్తుంది.అయితే మనం ఇప్పటిదాకా ఎరుపురంగులో ఉండే టమోటాలనే చూసి ఉంటాము.

కానీ ఇకమీదట టొమోటోలు కూడా సరికొత్త రంగులతో మార్కెట్ లో సందడి చేయనున్నాయి.కలర్ ఫుల్ రంగులతో టామోటోలు ఏంటని ఆశ్చర్యపోతున్నారా.

అవునండి ఇది నిజమే త్వరలో మార్కెట్ లోకి పసుపు, పింక్ కలర్ టమాటాలు కూడా రాబోతున్నాయి.ఇప్పటివరకు ఇతరదేశాలలో ప్రసిద్ధి చెందిన పింక్ టొమాటో ఇప్పుడు భారతదేశంలో కూడా సందడి చేయడానికి ముస్తాబు అయింది.

ఇప్పుడు మన దేశ వాతారణ పరిస్థితులకు అనుగుణంగా పింక్ టమాటా పండనుంది.అలాగే వీటిల్లో నీటిలో కరిగే ఆంథోసైనిన్ వర్ణద్రవ్యం కూడా ఎక్కువగా ఉంటుంది.

వీటిల్లో క్యాన్సర్ నిరోధక గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి.అయితే మనం వాడే ఎరుపు టమోటాలలో పుష్కలంగా ఉన్న లైకోపీన్ పిగ్మెంట్ మాత్రం ఈ పింక్ టమాటాలో తక్కువ సాంద్రతను కలిగి ఉంటుందన్నమాట.

కాగా ఈ పింక్ టమాటా రకాన్ని సుమారు 150-180 రోజులు సాగు చేస్తారు.కిలో టొమోటో సాగుకు దాదాపు రూ.25 – 30 ఖర్చవుతుంది.ఇతర పంటలకంటే ఈ టొమోటో పంట వేగంగా పండుతుంది.వివరాల్లోకి వెళితే.సైదయ్య అనే వ్యక్తి హైదరాబాద్‌లోని వనపర్తి జిల్లా మోజర్లలోని హార్టికల్చర్ కళాశాలలో జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్‌ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.

సైదయ్య గతంలో ‘రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు, యువ శాస్త్రవేత్త అనే బహుమతులు గెలుచుకున్నారు.

Telugu Latest, Tamotos-Latest News - Telugu

ఆయన ఇప్పటివరకు వంశపారంపర్య పద్ధతిని ఉపయోగించి పింక్ టమోటా, పసుపు టమోటా, ఎరుపు ఉసిరికాయ, యార్డ్‌లాంగ్ బీన్స్‌ లోని మంచి విత్తన రకాలను ఉత్పత్తి చేశారు.జీడిమెట్లలోని హార్టికల్చర్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో ఈ విత్తనాలను పరీక్షల నిమిత్తం పంపామని త్వరలో మార్కెట్‌లో అందుబాటులోకి ఈ రకం టొమోటోలు అందుబాటులోకి వస్తాయని సైదయ్య చెప్పారు.కాగా ఈ పింక్ టమాటా రకంలో కూడా కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి.

అవి ఏంటంటే ఈ టమాటా స్కిన్ చాలా సున్నితంగా పలచగా ఉంటుంది కాబట్టి వీటిని రవాణా చేసే సమయంలో పాడయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.ఎంతో జాగ్రత్తగా తరలించాలి.

అలాగే ఈ పింక్ టొమోటోలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు.కేవలం ఏడు రోజులు మాత్రమే వీటి జీవిత కాలం.

ఇక పసుపు రంగు టొమోటో విషయానికి వస్తే ఈ రకంలో బీటా కెరోటిన్, ప్రొవిటమిన్ A ఎక్కువగా ఉంటుంది.ఈ రకం టొమోటో కంటి చూపును మెరుగుపరచడానికి బాగా ఉపయోగపడుతుంది.

ఈ పసుపు రంగు టమాటాతో చేసిన వంటలు బంగారు రంగును సంతరించుకుంటాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube