Allu Sneha Reddy : అల్లు స్నేహా రెడ్డికి పడిపోయిన నెటిజన్లు.. ఆ వాయిస్, ఆ ఆందంపై ప్రశంసలు!

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి( Allu Arjun Wife Sneha Reddy ) ల గురించి మనందరికీ తెలిసిందే.ఇటీవల కాలంలో స్నేహ రెడ్డి పేరు తరచూ సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.

 Netizens Praises Allu Sneha Reddy Voice Video Viral-TeluguStop.com

మొన్నటి వరకు సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటూ ఫ్యామిలీ బాధ్యతలు నిర్వహిస్తూ బిజీ బిజీగా ఉన్న స్నేహ రెడ్డి ఈ మధ్యకాలంలో తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది.మొన్నటికి మొన్న ఫిట్నెస్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు వహిస్తూ, జిమ్లో వర్కౌట్స్ చేస్తున్న ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ వచ్చింది స్నేహ రెడ్డి.

ఆ తర్వాత వరుసగా సోషల్ మీడియా లో గ్లామర్ ఫోటోలను( Sneha Reddy Glamorous Photos ) షేర్ చేస్తూ వచ్చింది.ఇక ఇటీవలే మొట్టమొదటిసారి కెమెరా ముందుకు కూడా వచ్చిన విషయం తెలిసిందే.ఇలా ఈ మధ్యకాలంలో తరచూ స్నేహారెడ్డి సోషల్ మీడియా( Social Media )లో నిలుస్తూనే ఉంది.అంతేకాకుండా ఈ మధ్యకాలంలో స్నేహ రెడ్డి షేర్ చేసిన ఫోటోలను చూస్తే ఆమె ముందు హీరోయిన్స్ కూడా పనికిరారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఆ ఫోటోలను చూసిన అల్లు అభిమానులు అలాగే నేటిజన్స్ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వచ్చు కదా అంటూ ఆమెకు సలహాలు కూడా ఇస్తున్నారు.

స్నేహారెడ్డి స్లిమ్ గా హైట్ గా చాలా అందంగా ఉండడంతో అభిమానులు ఆమెను హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వమని వేడుకుంటున్నారు.కొందరు స్నేహారెడ్డి చూడడానికి హీరోయిన్ పూజా హెగ్డే మాదిరిగా కనిపిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా మరోసారి సోషల్ మీడియాలో ఈమె పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

అయితే అల్లు అర్జున్ అభిమానులు కూడా ఇప్పటివరకు నేహా రెడ్డి వాయిస్( Allu Sneha Reddy Voice ) వినలేదు.

కానీ మొట్టమొదటిసారి ఆమె మీడియాతో ముచ్చటించారు.ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ వీడియోని చూసిన నెటిజెన్స్ స్నేహ రెడ్డి వాయిస్ చాలా స్వీట్ గా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కొంతమంది ప్రేక్షకులు స్నేహ రెడ్డి వాయిస్ కి ఫిదా అయిపోయారు.

ఆ వీడియోని సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube