Nagababu: ఆరెంజ్ కలెక్షన్స్ పై నాగబాబు ఎమోషనల్ కామెంట్స్.. ఆ బాధ తీరిపోయిందంటూ?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) హీరోగా నటించిన చిత్రం ఆరెంజ్‌.( Orange Movie ) ఈ సినిమాకు మెగా బ్రదర్ చరణ్ బాబాయి అయిన నాగబాబు ( Nagababu ) నిర్మాతగా వ్యవహరించిన విషయం మనందరికీ తెలిసిందే.

 Nagababu Gets Emotional About Orange Movie Re Release Response And Collections-TeluguStop.com

బొమ్మరిల్లు భాస్కర్( Bommarillu Bhaskar ) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2010లో విడుదల అయి భారీ డిజాస్టర్ గా నిలిచిన సంగతి మనందరికీ తెలిసిందే.ఇందులో చెర్రీ సరసన జెనీలియా హీరోయిన్ గా నటించింది.

కాగా అప్పట్లో చిరుత, మగధీర సినిమాలతో సక్సెస్‌ ట్రాక్‌లో ఉన్న చరణ్ కి ఆరెంజ్‌ అడ్డుకట్ట వేసిందని చెప్పవచ్చు.ఆరెంజ్ సినిమా అటు హీరోకి ఇటు నిర్మాతకి అలాగే డైరెక్టర్ కి కోలుకోలేని దెబ్బ కొట్టింది.

డైరెక్టర్ భాస్కర్ మరో సినిమా చేయడానికి ఏకంగా మూడేళ్లు సమయం పట్టింది.

అలాగే నిర్మాత నాగబాబు కూడా ఆర్థికంగా చాలా నష్టపోయారు.

అంతేకాకుండా ఆరెంజ్ సినిమా వల్ల చాలా నష్టపోయానని కృంగిపోయానని ఆత్మహత్య కూడా చేసుకోవాలని అనిపించింది అంటూ ఒకానొక దశలో తెలిపారు నాగబాబు.ఇదంతా పక్కన పెడితే తాజాగా హీరో రామ్ చరణ్ 38వ పుట్టినరోజు సందర్భంగా వలే మార్చి 27వ తేదీన ఈ ఆరెంజ్ సినిమాని థియేటర్లలోకి మళ్లీ రీ రిలీజ్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే.

అయితే చెర్రీ పుట్టినరోజు సందర్భంగా చెర్రీ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన మగధీర సినిమాకు బదులుగా ఈ సినిమాని విడుదల చేశారు.మొదటిసారి భారీ డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమా రీ రిలీజ్ లో మాత్రం భారీగా కలెక్షన్స్ సాధించింది.

ఈ నెల 27న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా దాదాపుగా 75 లక్షల గ్రాస్ ని సాధించింది.కాగా ఆరెంజ్ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ చూసి నిర్మాత నాగబాబు చాలా సంతోష పడిపోయారు.నేపథ్యంలోనే ఆ సంతోషాన్ని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేశారు.ఈ సందర్భంగా నాగబాబు ఆ వీడియోలో మాట్లాడుతూ.చిరుత, మగధీర వంటి హిట్‌ సినిమాలతో జోష్‌లో ఉన్న రామ్‌ చరణ్‌ కి ఫ్లాప్ ఇచ్చాననే బాధ ఇన్ని రోజులు ఉండేది.ఈ సినిమాను రీ రిలీజ్ చేద్దామంటే నేను కాస్త ఆలోచించాను.

కానీ ఆర్ఆర్ఆర్ సినిమాకి గ్లోబల్ అవార్డు, ఆస్కార్ అవార్డు రావడంతో ఆ ఉత్సాహంతో ఆరెంజ్ ను రీ రిలీజ్ చేద్దామనుకున్నాను.

ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్‌, వసూళ్లను చూస్తుంటే షాకింగ్ గా ఉంది.ఆరెంజ్ సినిమాకి ఇంతమంది అభిమానులున్నారా అని ఆశ్చర్యమేసింది.2010లో వచ్చిన ఈ సినిమా పెద్దగా ఎవరికీ నచ్చలేదు.కానీ ఇప్పటి జనరేషన్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది.అందుకే ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చాయి.ఇక ఆరెంజ్‌ను కూడా రామ్ చరణ్ హిట్‌ మూవీల్లో ఒకటిగా పరిగణించవచ్చు.నా వల్ల చరణ్ కి సక్సెస్ దూరమైందన్న బాధ నేటితో పోయింది.

ఇదంతా రామ్‌ చరణ్‌ వల్లే సాధ్యమయ్యింది అని చెప్పుకొచ్చారు నాగబాబు.ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ వీడియో పై మీద అభిమానులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube