చంద్రబాబు ను పొగిడేస్తున్న వైఎస్ ఆత్మ ! పోరాడాలని పిలుపు 

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి( YS Rajasekhar Reddy ) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అన్నీ తానే చక్రం తిప్పి , రాజశేఖర్ రెడ్డి ఆత్మగా పేరుపొందిన కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచందర్రావు గత కొద్ది రోజులుగా మళ్లీ యాక్టివ్ అయ్యారు.రాజకీయ ప్రకటనలు చేస్తూ హడావుడి చేస్తున్నారు.

 Ys Soul Praising Chandrababu! A Call To Fight , Jagan, Cbn, Ysrcp, Rahul Gandhi,-TeluguStop.com

తాజాగా టిడిపి అధినేత చంద్రబాబును పొగడ్తలతో ముంచేస్తారు.అంతేకాదు చంద్రబాబు కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉన్నారంటూ పేర్కొన్నారు.

చంద్రబాబు( Chandrababu ) ప్రతిపక్షాల ఉద్యమంలోకి రావాలని,  ఆయన ఢిల్లీలోనూ పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.కాంగ్రెస్ ( Congress)కీలక నేత రాహుల్ గాంధీ( Rahul Gandhi )కి అన్యాయం జరిగితే ఏపీ నుంచి అడిగే వారు ఎవరు లేకుండా పోయారని , ప్రజాస్వామ్యం అంటే అత్యంత గౌరవం ఉన్న ప్రతిపక్ష నేత రాష్ట్రంలో ఉన్నారంటూ చంద్రబాబును ఉద్దేశించి కెవిపి అన్నారు.

Telugu Ap, Chandrababu, Jagan, Kvpramachandra, Rahul Gandhi, Ysrajasekhar, Ysraj

చిన్న చిన్న విషయాలకు వీధిన పడి కొట్టుకుంటున్న రాహుల్ గాంధీ పై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతుంటే ఏపీ నుంచి ఒక్క ప్రజా ప్రతినిధి , ఒక్క లోక్ సభ సభ్యుడు కూడా ఆ ప్రజాస్వామ్య విధానాన్ని ఖండించకపోవడం కెవిపి అసంతృప్తి వ్యక్తం చేశారు.రాహుల్ గాంధీ పై బిజెపి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెడుతున్న , వైసిపి మాట్లాడకపోవడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయని , ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తుంటే రాష్ట్రం నుంచి ఎందుకు మాట్లాడరని కెవిపి ప్రశ్నించారు.1984లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చంద్రబాబు పోరాటం చేశారని,  హైదరాబాద్ కు వస్తే అరెస్టు చేస్తానని ప్రకటించిన ధైర్యవంతుడు అంటూ చంద్రబాబును కెవిపి పొగడ్తలతో ముంచేస్తారు.అయితే ఇప్పుడు చంద్రబాబు కూడా మౌనంగా ఉన్నారని , అలాగే ప్రశ్నిస్తానని చెప్పే జనసేన ని బిజెపి నేతలను అంతర్గతంగా అయినా ప్రశ్నించాలని సూచించారు.

Telugu Ap, Chandrababu, Jagan, Kvpramachandra, Rahul Gandhi, Ysrajasekhar, Ysraj

2018 చంద్రబాబు ఢిల్లీలో ప్రత్యేక హోదాపై దీక్ష చేస్తే రాహుల్ గాంధీ సంఘీభావం ప్రకటించారని, 2019లో చంద్రబాబు ఓటమి చెందిన తర్వాత ఆయనను కించపరచవద్దని కాంగ్రెస్ శ్రేణులకు సూచించారని కెవిపి గుర్తు చేశారు .అంతేకాదు చంద్రబాబు  2019లో ఢిల్లీలో దీక్ష చేస్తే రాహుల్, మన్మోహన్ సింగ్ వెళ్లి సంఘీభావం ప్రకటించారని కెవిపి అన్నారు.రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దుకు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి చంద్రబాబు ముందుకు రావాలని, అవసరం అయితే చంద్రబాబు ను కలిసేందుకు కూడా ఎటువంటి అభ్యంత్రం లేదని కేవీపీ అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube