తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు నాగశౌర్య.
ఇది ఇలా ఉంటే గత కొద్దిరోజుల హీరో నాగ శౌర్యకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.నాగ శౌర్య ఎట్టకేలకు ఒక ఇంటివాడు కాబోతున్నాడు.
బెంగళూరుకు చెందిన ఓ అమ్మాయితో పెళ్లి జరగనుండగా,తాజాగా వారి పెళ్లికి సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి.హీరో నాగేశ్వర్ రోజా పెళ్లి నేడు అనగా నవంబర్ 20 ఉదయం 11:25 నిమిషాలకు జరగనుంది.
అయితే నాగశౌర్య బెంగళూరుకు చెందిన అనూష శెట్టి అని అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు.అయితే అది కొద్ది మంది సన్నిహితులు స్నేహితులు బంధువుల సమక్షంలో వీరి పెళ్లి గ్రాండ్ గా జరగనుంది.
నాగశౌర్య భార్య అనూష శెట్టి బెంగళూరులోని ఇంటీరియర్ డిజైనర్ గా పని చేస్తోంది.నాగశౌర్య పెళ్లి సందర్భంగా తన కాబోయే భార్యతో కలిసి ఫోటోలు దిగాడు.ఈ నేపథ్యంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కాగా నాగశౌర్య ఆ ఫోటోలలో బ్లూ కలర్ కుర్తా, బ్లాక్ కలర్ పైజామా ధరించి పెళ్లి దుస్తుల్లో ఆనందంగా కనిపిస్తున్నాడు.
అనూష శెట్టి గోధుమ రంగు డిజైనర్ డ్రెస్ లో ఎంతో అందంగా కనిపించింది.ఇద్దరూ ఈడు జోడు ఎంతో అందంగా ఉంది.ఈ ఫోటోలను చూసిన నాగశౌర్య అభిమానులు అతనికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.కొంతమంది ఈ జంటను చూసి చూడముచ్చటగా ఉన్నారు అంటూ కామెంట్స్ తెలియజేస్తున్నారు.ఇకపోతే నాగశౌర్య తెలుగులో చలో,వరుడు కావలెను, అశ్వర్ధామ, లక్ష్య లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.