నాగ చైతన్య థ్యాంక్యు ప్రీ లుక్ పోస్టర్..!

అక్కినేని హీరో నాగ చైతన్య ఇప్పుడు కెరియర్ లో సూపర్ ఫాం లో ఉన్నాడు.రీసెంట్ గా లవ్ స్టోరీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాగ చైతన్య నెక్స్ట్ సినిమా విక్రం కుమార్ డైరక్షన్ లో చేస్తున్నాడు.

 Naga Chaitanya Thank You Pre Look Released, Naga Chaitanya,thank You Movie, Than-TeluguStop.com

థ్యాంక్యు అంటూ రాబోతున్న ఈ సినిమా ప్రీ లుక్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్.నాగ చైతన్య బర్త్ డే నవంబర్ 23 కాగా బర్త్ డే సందర్భంగా థ్యాక్యు ప్రీ లుక్ రిలీజ్ చేశారు.

ఇక సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను రేపు రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.

విక్రం కుమార్ తో ఆల్రెడీ మనం సినిమా చేశాడు నాగ చైతన్య.

ఆ సినిమా అక్కినేని ఫ్యామిలీకి మరచిపోని సినిమాగా నిలిచింది.నానితో గ్యాంగ్ లీడర్ తర్వాత విక్రం కుమార్ చేస్తున్న ఈ థ్యాంక్యు సినిమా థ్రిల్లర్ కాన్సెప్ట్ లో వస్తుందని తెలుస్తుంది.

ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా అవికా గోర్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది.సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఈ సినిమాతో పాటుగా నాగ చైతన్య బంగర్రాజు సినిమాలో నటిస్తున్నాడు.కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube