టాలీవుడ్లో అల్లరి నరేష్ కామెడీ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు.కెరీర్ ఆరంభంలో వరుసబెట్టి కామెడీ చిత్రాలతో దూసుకుపోయిన ఈ హీరో, ప్రస్తుతం చాలా తక్కువగా సినిమాలు చేస్తున్నాడు.
ఒక విధంగా ఫేడవుట్ అయిన ఈ హీరో మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రంతో క్యారెక్టర్ పాత్రల్లోకి వెళ్లిపోయాడు.కానీ అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఇప్పుడు నాంది అనే వైవిధ్యమైన సినిమాతో మనముందుకు రావడానికి రెడీ అయ్యాడు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది.అల్లరి నరేష్ రొటీన్ సినిమాలకు ఇది పూర్తి వైవిధ్యంగా ఉండబోతుందనే విషయం ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే తెలిసిపోతుంది.
ఇక తాజాగా ఈ సినిమా టీజర్‌ను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అనే విషయంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది.జూన్ 30న నాంది చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
ఈ మేరకు మరో కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు.ఈ పోస్టర్లో అల్లరి నరేష్ పోలీస్ స్టేషన్లో పూర్తి నగ్నంగా కూర్చున్న పోస్టర్‌ను రివీల్ చేశారు.
ఈ పోస్టర్ చూస్తుంటే ఇదొక సీరియస్ మూవీ అని తెలుస్తోంది.మరి ఈ సినిమాతో అల్లరి నరేష్ సక్సెస్ అందుకుంటాడా లేడా అనేది ఆసక్తికరంగా మారింది.
వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను విజయ్ కనకమేడల అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.మరి నాంది టీజర్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.