రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.ఈ క్రమంలో ముందుగా ఆయన తెలుగు ప్రజలందరికీ నమస్కారాలు తెలిపారు.
తాను కష్టంలో ఉన్నప్పుడు సంఘీభవాన్ని తెలియజేసినందుకు గానూ చంద్రబాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు చూపిన అభిమానాన్ని తన జీవితంలో మర్చిపోనని చెప్పారు.
గతంలో తాను చేసిన అభివృద్ధి ఈ రోజు ఉపయోగపడిందన్నారు.లాభం లేకుండా చేపట్టిన ప్రభుత్వ విధానాల వలనే ఇవాళ దేశవ్యాప్తంగా తనపై అభిమానం చూపిస్తున్నారని తెలిపారు.
తన 40 ఏళ్ల రాజకీయ సుదీర్ఘ అనుభవంలో తాను ఏ తప్పు చేయలేదని అలాగే ఎవరినీ తప్పు చేయనివ్వలేదని చెప్పారు.ప్రజలతో పాటు పార్టీలు కూడా తనకు పూర్తిగా సహకరించి సంఘీభావం తెలిపారన్నారు.
ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు చెబుతున్నట్లు వెల్లడించారు.తన జీవితం ధన్యమైందని తెలిపారు.