ఆయనది ఒక సంగీతమేనా ? అసలు మ్యూజిక్ అంటే ఏంటో తెలుసా ? సప్త స్వరాలపై అవగాహన ఉందా అంటూ వెక్కిరించిన ఆ నోర్లె ఆయన లేనిదే సినిమా లేదు, ఆయన పాట లేకపోతే హుషారే ఉండదు.ఏ హీరో కైనా స్టెప్పులు వేయించాలంటే కేవలం అతనితోనే సాధ్యం అని అన్నవారు.
ఇంతకు ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా ? సంగీత స్వర చక్రవర్తి గురించే అండి ఇదంతా కూడా.సంగీతంతో 1972 నుంచి 1990 వరకు అందర్నీ రెండు దశాబ్దాల పాటు ఒక ఊపు ఊపిన సంగీత దర్శకుడు చక్రవర్తి( Chakravarthi ).ఆయన జయంతి సందర్భంగా ఒక రెండు మాటలు అయినా మాట్లాడుకోకపోతే సంగీత ప్రపంచం మూగబోతుందేమో అనిపిస్తుంది.
చక్రవర్తి మనసు పెట్టి చేస్తే అది ఖచ్చితంగా క్లాసిక్ పాటగా ఉండిపోతుంది.లేదంటే అదొక ఊర మాస డ్యూయెట్ అయిపోతుంది.దేనికైనా పెద్దగా కష్టపడి పని చేసినట్టుగా కనిపించడు.
కానీ అతడు లేనిదే సంగీతం లేదు అనేంతగా అతని ప్రభావం ఉంటుంది.అది చక్రవర్తి యొక్క సంగీత పరిజ్ఞానం.
అతన్ని వెక్కిరించిన వాళ్లే చక్రవర్తి లేనిదే సంగీతమే లేదు అనేంతగా మైమరిపించేలా పాటలు వాయించాడు.డబ్బు కొట్టడం తప్ప మరేమి రాదు అంటూ ఎంతో మంది పెదవి విరిచిన వారే, కానీ చక్రవర్తి లేకుండా శోభన్ బాబు సినిమా( Sobhan Babu )లు కొన్నేళ్లపాటు లేవనే చెప్పాలి.
అలాగే శోభన్ బాబు మాత్రమే కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామందికి చక్రవర్తి సంగీతం అంటే పంచప్రాణాలు.
చిరంజీవి ( Chiranjeevi )లాంటి హీరోకి చక్రవర్తి సంగీతం ( Music )అందించలేదని కొందరు అనుకుంటారు కానీ చక్రవర్తి సంగీతానికే చిరంజీవి డాన్స్ చేస్తాడు అనే విషయం వారికి తెలిసి ఉండదు.కానీ అప్పట్లో కుర్ర కారుకు చక్రవర్తి పాటలే ఆహారం అనేంతగా ఉండేది పరిస్థితి.అప్పట్లో పెళ్లిళ్లు జరిగిన లేదా ఏదైనా ఊరేగింపు ఉన్న చివరికి సెలూన్ లో కూడా చక్రవర్తి పాటలు మారుమ్రోగి పోయేవి.
ఒక ఓవర్ క్లాస్ నుంచి ఊర మాస్ వరకు పాటను ఏ విధంగా అయినా మలచే గలిగే గొప్పతనం ఉన్న సంగీత దర్శకుడిగా చక్రవర్తి పేరు సువర్ణ అక్షరాలతో చరిత్రలో లిఖించబడి ఉంటుంది
.