రాక్షసుడిని ఉరి తీస్తేనే ఆమె ఆత్మకు శాంతి

ఆంధ్రప్రదేశ్ లోని మచిలీ పట్నంకు చెందిన ఎస్తేర్ అనూహ్య మీద అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన నరరూప రాక్షసుడికి ముంబైలోని మహిళా కోర్టు ఉరి శిక్ష విధించింది.దీన్ని అరుదైన కేసుల్లోకెల్లా అరుదైన కేసుగా జడ్జి వృశాలి జోషీ పేర్కొన్నారు.

 Convict Chandrabhan Sanap Sentenced To Death-TeluguStop.com

దోషి చంద్రభాన్ సనప్ను చనిపోయేదాకా ఉరి తీయాలి అని న్యాయమూర్తి తీర్పు చెప్పారు.ముంబైలోని టీసీఎస్ కంపెనీలో పనిచేస్తున్న 23 ఏళ్ళ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనూహ్యను చంద్రభాన్ గత ఏడాది దారుణంగా హత్య చేసాడు.

క్రిస్మస్ సెలవులకు మచిలీపట్నం ముంబాయికి తిరిగి వెళ్ళిన వెంటనే అనూహ్య హత్యకు గురైంది.చంద్రభాన్ ఆమె శవాన్ని కూడా కాల్చేసాడు.

ఆమె చనిపోయిన సంగతి పదకొండు రోజుల తరువాత తెలిసింది.ఎవరికైనా ఉరి శిక్ష విధించగానె మానవ హక్కుల సంఘాలు, పౌర హక్కుల సంఘాలు ఆందోళన చేస్తాయి.

కాని జరిగిన దారుణం గురించి ఆలోచించవు.ప్రస్తుత కేసు హై కోర్టుకు, సుప్రీం కోర్టుకు కూడా వెళ్ళవచ్చు.

ఆ కోర్టులు కూడా ఉరి శిక్షను సమర్ధించి అమలు చేస్తేనే అనూహ్య ఆత్మకు శాంతి కలుగుతుంది.అత్యాచారాలకు పాల్పడే వారిని హెచ్చరించినట్లు ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube