ప్రస్తుత జీవనశైలి, అహరపు అలవాట్లలో మార్పులు రావడం వల్ల చాలా మందికి కంటి చూపు( Eye Sight ) మసకబారుతూ ఉంది.దీనికి ముఖ్య కారణం పోషకాహార లోపం అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అలాగే కనులకు అవసరమయ్యే విటమిన్ సరిగ్గా అందడం లేదని కూడా చెబుతున్నారు.కళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి విటమిన్ సి ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
ఒక వేళ ఈ విటమిన్ లోపిస్తే కంటి చూపు తగ్గిపోతుంది.ధూమపానం చేయడం, మద్యం తాగడం మానసిక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే శరీరంలో విటమిన్ సి లోపం( Vitamin C Deficiency ) ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఈ పరిస్థితిలో విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలను ఆహారంలో భాగం చేసుకోవడం ఎంతో మంచిది.సాధారణంగా మగవారికి 90 మిల్లీగ్రాములు, ఆడవారికి 75 గ్రాముల విటమిన్ సి అవసరం ఉంటుంది.ఇది అందకపోతే శరీరంలో అనేక రకాల సమస్యలు ఏర్పడతాయి.విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను( Antioxidant ) కలిగి ఉంటుంది.ఇది కళ్ళని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.ప్రతిరోజు విటమిన్ సి తీసుకుంటే కంటి శుక్లం వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు దూరమవుతాయి.
ఒక వేళ విటమిన్ సి లోపం ఉన్నట్లయితే కళ్ళకు వచ్చే ప్రమాదం మరింత పెరుగుతుంది.

ముఖ్యంగా చెప్పాలంటే విటమిన్ సి లోపం ఉంటే వచ్చే లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే పొడి, చీలిపోయిన వెంట్రుకలు, గాయాలు మానడానికి ఎక్కువ సమయం పట్టడం, రక్తహీనత, చిగుళ్లలో రక్తస్రావం, పొడి, పులుసుల చర్మం, కీళ్లనొప్పులు( Knee Pains ), దంతాలు బలహీనపడడం, జీవక్రియ మందగించడం లాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి.ఇంకా చెప్పాలంటే విటమిన్ సి లోపం వల్ల చాలామందికి స్కర్వి వ్యాధి వస్తుంది.
అలాగే బలహీనత, అలసట కూడా ఉంటుంది.దంతాలు వదులుగా మారుతాయి.
గోళ్లు బలహీనంగా మారుతాయి.కీళ్లలో నొప్పి ఉంటుంది.
జుట్టు రాలడం మొదలవుతుంది.ముఖ్యంగా చెప్పాలంటే ఉసిరి, ఆరెంజ్, నిమ్మకాయ, ద్రాక్ష, ఆపిల్, అరటి రేగు పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.