తెలుగులో తక్కువ సినిమాలలోనే నటించినా మృణాల్ ఠాకూర్ కు( Mrunal Thakur ) ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మృణాల్ ఠాకూర్ పారితోషికం కూడా భారీ స్థాయిలోనే ఉంది.
తెలుగులో వరుస ఆఫర్లతో బిజీ అవుతున్న ఈ బ్యూటీకి ఇతర భాషల్లో మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు రావడం లేదు.ఎన్ని సినిమాలు చేశామనే దానికాంటే ఎన్ని మంచి సినిమాలు చేశామనేది ముఖ్యమని ఆమె తెలిపారు.
కెరీర్ తొలినాళ్లలో సీరియల్స్ లో నటించిన మృణాల్ ఠాకుర్ ప్రస్తుతం సినిమాలలో నటిస్తున్నారు.తాను కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నా బాలీవుడ్ పెద్ద సినిమాలలో మాత్రం అవకాశాలు రావడం లేదని ఆమె చెబుతున్నారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో రొమాంటిక్ సినిమాలలో( Romantic Movies ) నాకు ఆఫర్లు రావడం లేదని బహుశా నేనింకా అక్కడంత ఫేమస్ కాలేదేమో అంటూ ఆమె కామెంట్లు చేశారు.
నాకు చాలా మూవీ ఆఫర్లు వస్తున్నాయి కానీ ఆ సినిమాలలో లవ్ స్టోరీలు( Love Stories ) లేవని మృణాల్ వెల్లడించారు.ఆ తరహా సినిమాలు చేయాలని ఉన్నా డైరెక్టర్ల చుట్టూ తిరిగి విసిగిపోయానని నన్ను నేను ప్రూవ్ చేసుకునే క్రమంలో అలసిపోయానని ఇక మూవీ ఆఫర్లు( Movie Offers ) రావడం అనేది సహజంగా జరగాలని ఆమె పేర్కొన్నారు.మనమంతా చిన్నప్పటి నుంచి ప్రేమ, రొమాంటిక్ సినిమాలు చూస్తూ పెరిగామని మృణాల్ అన్నారు.
ప్రతి ఒక్కరూ రొమాన్స్ అంటే ఇష్టం లేని విధంగా నటిస్తారు కానీ అలాంటి సినిమాలే చూస్తారని ఆమె వెల్లడించారు.హాయ్ నాన్న,( Hi Nanna ) సీతారామం( Sitaramam ) అందరి అభిప్రాయాలను మార్చేశాయని ఇతర భాషల్లో సైతం అలాంటి సినిమాలు వస్తే చేయాలని ఉందని మృణాల్ అన్నారు.మృణాల్ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.మృణాల్ ప్రస్తుతం తెలుగులో ఫ్యామిలీ స్టార్( Family Star ) అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.