ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా మారి రాజరిక పాలన కొనసాగిస్తున్నారు.. మంద కృష్ణమాదిగ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా మారి రాజరిక పాలన కొనసాగిస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణమాదిగ విమర్శించారు.ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగ పరిరక్షణ సన్నాహక సదస్సులో మంద కృష్ణమాదిగ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

 Mrps Mandakrishna Madiga Fires On Cm Kcr Details, Mrps ,mandakrishna Madiga , Cm-TeluguStop.com

ఈ సందర్బంగా జరిగిన సదస్సులో మంద కృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమాన పరుస్తూ రాచరిక పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు.ఆనాడు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే దేశం అభివృద్ధి చెందిందని అన్నారు.

కేసీఆర్ రాజ్యాంగ వ్యతిరేక గా మారి అగ్రకుల దురహంకారంతో వ్యవహరిస్తున్నాడని దీని వలన అణగారిన వర్గాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు.

రాజ్యాంగాన్ని మార్చాలని అవహేళన చేసిన కేసీఆర్కు బుద్ధి చెప్పాలని పిలుపు నిచ్చారు.

తెలంగాణ ఉద్యమ పోరాట సమయంలో తెలంగాణ వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చి మోసం చేశారని విమర్శించారు.చట్టసభల్లో రాజ్యాంగం వలన అణగారిన వర్గాలకు మహిళలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించారని అన్నారు.

అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ఏప్రిల్ తొమ్మిదివ తేదీన హైదరాబాద్లో జరిగే భారీ బహిరంగ సభను అన్నివర్గాల ప్రజలు విజయవంతం చేయాలి కోరారు.

ఎమ్మార్పీఎస్ పోరాటాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకు వృద్ధులకు వితంతువులకు పెన్షన్లు పెంచడం జరిగిందని పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ వర్తిచిందని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఏడు శాతం ఉన్న అగ్రకులాలకు పదకొండు మంది మంత్రిపదవులు పొందారని తొంభై మూడు శాతం ఉన్న ఇతర కులాలకు ఎనిమిది మంది మంత్రులను కొనసాగిస్తు రాజ్యాంగానికి తూట్లు పొడిచారని విమర్శించారు.శాసనసభలో బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ను పిలవకుండా రాజ్యాంగాన్ని అవమానపరిచారని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు బచ్చలకూర వెంకటేశ్వర్లు శ్రీనివాస్ యాదవ్ వెంకన్న కోటి పలువురు సంఘ నాయకులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube