తిరుమలలోని భూతీర్థ వృత్తాంతం గురించి మీకు తెలుసా?

తిరుమలలో కొలువై ఉన్న శ్రీనివాసుడి గురించి అందరికీ తెలుసు.అయితే అక్కడి పూల బావి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది.

 Do You Know The Tirumala Bhu Theertha Story, Tirumala Bhu Theertha , Rangadasu,-TeluguStop.com

ఆ పూల బావిని భూతీర్థం అంటారు.ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు.

కానీ ఇదే నిజం.అయితే తిరుమల శ్రీనివాసుడు అలంకార ప్రియుడు.

రకరకాల పూలతో స్వామి వారిని అలకరించడం మనం తరచూ చూస్తుంటాం.శ్రీహరికి సమర్పించిన తులసి, పుష్పాలను ప్రసాదంగా భక్తులకు ఇచ్చే సంప్రదాయం తిరుమలలో లేదు.

అయితే ఆ పవిత్ర నిర్మాల్యాన్ని ఎవరూ వినియోగించకుండా ఓ బావిలో నిమజ్జనం చేస్తారు.ఆ బావినే పూల బావి అని పిలుస్తుంటారు.

దీన్నే భూ తీర్థం అని కూడా అంటారు.అయితే ఈ తీర్థం భూదేవి వల్ల ఏర్పడిందని చెబుతారు.

కాలాంతరంలో ఈ తీర్థం భూమిలో నిక్షిప్తమైపోయింది.శ్రీనివాసుని ఆనతిపై రంగదాసు అనే భక్తుడు ఒక బావిని తవ్వగా భూ తీర్థం మళ్లీ వెలుగులోకి వచ్చిందని స్థల పురాణం చెబుతోంది.

కానీ ఇటీవల కాలంలో తిరుమల వేంకటేశ్వర స్వామికి జరిగే సేవల్లో విశేషంగా పుష్పాలంకరణ జరుగుతున్నందు వల్ల విపరీతంగా పేరుకుపోతున్న ఈ నిర్మాల్యాన్ని తిరుమల పర్వత సానువుల్లో ఎవ్వరూ తొక్కని చోట వేస్తున్నారు.అయితే ఈ పూల బావికి పూర్వం మెట్లు ఉన్న దిగుడు బావిగా ఉండేది.

ఆ తర్వాత కాలంలో చుట్టూ రాతి గోడతో ఈ బావి గుండ్రమైన చేదురు బావి వలె పునర్నిర్మించబడింది.ఇటీవల ఈ బావిపై ఇనుప కడ్డీల తడకను కప్పి వాటిపై పూల కుండీలను కూడా ఏర్పాటు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube