తిరుమలలోని భూతీర్థ వృత్తాంతం గురించి మీకు తెలుసా?

తిరుమలలో కొలువై ఉన్న శ్రీనివాసుడి గురించి అందరికీ తెలుసు.అయితే అక్కడి పూల బావి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది.

ఆ పూల బావిని భూతీర్థం అంటారు.ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు.

కానీ ఇదే నిజం.అయితే తిరుమల శ్రీనివాసుడు అలంకార ప్రియుడు.

రకరకాల పూలతో స్వామి వారిని అలకరించడం మనం తరచూ చూస్తుంటాం.శ్రీహరికి సమర్పించిన తులసి, పుష్పాలను ప్రసాదంగా భక్తులకు ఇచ్చే సంప్రదాయం తిరుమలలో లేదు.

అయితే ఆ పవిత్ర నిర్మాల్యాన్ని ఎవరూ వినియోగించకుండా ఓ బావిలో నిమజ్జనం చేస్తారు.

ఆ బావినే పూల బావి అని పిలుస్తుంటారు.దీన్నే భూ తీర్థం అని కూడా అంటారు.

అయితే ఈ తీర్థం భూదేవి వల్ల ఏర్పడిందని చెబుతారు.కాలాంతరంలో ఈ తీర్థం భూమిలో నిక్షిప్తమైపోయింది.

శ్రీనివాసుని ఆనతిపై రంగదాసు అనే భక్తుడు ఒక బావిని తవ్వగా భూ తీర్థం మళ్లీ వెలుగులోకి వచ్చిందని స్థల పురాణం చెబుతోంది.

కానీ ఇటీవల కాలంలో తిరుమల వేంకటేశ్వర స్వామికి జరిగే సేవల్లో విశేషంగా పుష్పాలంకరణ జరుగుతున్నందు వల్ల విపరీతంగా పేరుకుపోతున్న ఈ నిర్మాల్యాన్ని తిరుమల పర్వత సానువుల్లో ఎవ్వరూ తొక్కని చోట వేస్తున్నారు.

అయితే ఈ పూల బావికి పూర్వం మెట్లు ఉన్న దిగుడు బావిగా ఉండేది.

ఆ తర్వాత కాలంలో చుట్టూ రాతి గోడతో ఈ బావి గుండ్రమైన చేదురు బావి వలె పునర్నిర్మించబడింది.

ఇటీవల ఈ బావిపై ఇనుప కడ్డీల తడకను కప్పి వాటిపై పూల కుండీలను కూడా ఏర్పాటు చేశారు.

ప్రొడ్యూసర్లు గా మారుతున్న మన స్టార్ డైరెక్టర్ల భార్యలు…