టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజును ఈ రోజు జరుపు కుంటున్నారు.ఈయన పుట్టిన రోజు అంటే ఫ్యాన్స్ కు పండగ అనే చెప్పాలి.
నందమూరి ఫ్యాన్స్ అంతా ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా చేస్తున్నారు.సోషల్ మీడియాలో కూడా ఎన్టీఆర్ బర్త్ డే వల్ల సందడిగా మారింది.
ఈ క్రమంలోనే ఈయన కొత్త సినిమాల అప్డేట్ లు వరుసగా రావడానికి రెడీగా ఉన్నాయి.
ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు ఎన్టీఆర్.
ఈ సినిమా భారీ విజయం తర్వాత కొరటాల శివ తో సినిమా చేయనున్నాడు.అయితే ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు.
ఈ రోజు బర్త్ డే జరుపు కుంటున్న నేపథ్యంలో NTR30 నుండి బిగ్ అప్డేట్ ఇప్పటికే మేకర్స్ ఇచ్చేసారు.నిన్న సాయంత్రం ఈ సినిమా నుండి మోషన్ పోస్టర్ రిలీజ్ చేయగా ఈ చిన్న వీడియోకు నెట్టింట భారీ స్పందన లభించింది.
ఈ మోషన్ పోస్టర్ లో ఎన్టీఆర్ చెప్పిన మాస్ డైలాగ్ కు ఆయన వాయిస్ కు గూస్ బంప్స్ వచ్చాయి.మరి ఈ సినిమా వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్ళడానికి రెడీగా ఉంది.
నిన్న రాత్రి వచ్చిన ఈ మోషన్ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి భారీ స్పందన లభించింది.మోషన్ పోస్టర్ కి మాములుగా రెస్పాన్స్ రావడం లేదు.మన సౌత్ ప్రేక్షకులు మాత్రమే కాదు.ఈ మోషన్ పోస్టర్ కు నార్త్ ప్రేక్షకులు సైతం ఆకట్టుకుంది.
ఎన్టీఆర్ 30 కోసం విడుదల చేసిన వీడియోలో తారక్ హిందీలో కూడా డబ్బింగ్ చెప్పి అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.మన తెలుగు లో ఎంత పవర్ ఫుల్ గా డైలాగ్ చెప్పాడో హిందీలో కూడా ఆయన చెప్పిన డైలాగ్ కు హిందీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఇక ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తుండగా.మరొక నెల రెండు నెలల్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.మోషన్ పోస్టర్ చూస్తేనే కొరటాల మళ్ళీ ఫామ్ లోకి రావడం కోసం ఎంతగా కష్టపడుతున్నాడో అర్ధం అవుతుంది.మరి ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్ కొట్టేలాగానే కనిపిస్తున్నాడు.