తెలుగు సినీ సీనియర్ నటుడు మోహన్ బాబు గురించి అందరికీ తెలిసిందే.తన నటనతో తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు సాధించుకున్నారు.
మొదట విలన్ గా పరిచయమైన మోహన్ బాబు ఆ తర్వాత హీరోగా నటించారు.ఎన్నో హాస్య పరమైన సినిమాలు, యాక్షన్, సెంటిమెంట్ లతో కూడిన సినిమాలలో నటించారు.ఇదిలా ఉంటే ఈరోజు మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనను హీరోగా నిలబెట్టిన కొన్ని సినిమాలు గురించి తెలుసుకుందాం.
1982లో తెరకెక్కినా అసెంబ్లీ రౌడీ సినిమాలో మోహన్ బాబు హీరోగా నటించాడు.అందులో ఆయన సరసన హీరోయిన్ దివ్యభారతి నటించింది.ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.ఇక పెదరాయుడు సినిమా లో ద్వి పాత్రలో నటించిన మోహన్ బాబు కు ఈ సినిమా వల్ల మంచి పేరు సంపాదించుకున్నారు.
కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన అల్లుడుగారు సినిమాలో హీరోగా నటించగా ఇందులో శోభన్ హీరోయిన్ గా నటించింది.
అంతేకాకుండా ఈయన దర్శకత్వంలోని మరో సినిమా మేజర్ చంద్రకాంత్ రాగా.అందులో మోహన్ బాబు నటనకు మంచి విజయం అందింది.
ఇక 1998లో విడుదలయిన సినిమా శ్రీరాములయ్య. ఈ సినిమాలో నటించగా సౌందర్య హీరోయిన్ గా నటించింది.రాఘవేంద్రరావు దర్శకత్వంలో మరో సినిమా అల్లరి మొగుడు తెరకెక్కగా.ఇందులో మోహన్బాబు సరసన మీనా, రమ్యకృష్ణ నటించారు.ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.
ఇక 1991లో తెరకెక్కిన రౌడీ గారి పెళ్ళాం సినిమా లో మోహన్ బాబు తన నటనతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఆ తర్వాత బ్రహ్మ సినిమాలో కూడా బాగా నటించాడు.వి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన అడవిలో అన్న సినిమా లో నటించగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక రాయలసీమ రామన్న చౌదరి, పోస్ట్ మాన్ సినిమా లో కూడా హాయ్ నటనకు మంచి గుర్తింపు అందింది.