నర్సాపురం నుంచి బిజెపి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసిన ఎంపీ రఘురామకృష్ణంరాజు( Raghurama Krishnam Raju )కు బిజెపి సీటు కేటాయించలేదు.అయితే రఘురామ వైసిపి అధినేత జగన్ పైన, ఏపీ ప్రభుత్వం పైన రాజీలేకుండా పోరాటం చేశారని, ఆయనపై అనేక కేసులు నమోదు చేసినా ఆయన ను చంపేందుకు కుట్రలు చేసినా, అవేమీ లెక్క చేయకుండా రఘురామ కృష్ణంరాజు పోరాటం చేశారని, అటువంటి వ్యక్తికి టిడిపి, జనసేన, బిజెపి లలో ఏదో ఒక పార్టీ టికెట్ కేటాయించకుండా పక్కన పెట్టడం పై తీవ్రమైన చర్చ జరుగుతోంది.
మీడియ, సోషల్ మీడియాలో రఘురామ కృష్ణంరాజుకు అనుకూలంగా వివిధ పార్టీలకి చెందినవారు పోస్టింగ్స్ పెడుతూ, ఆయనకు కచ్చితంగా సీటు ఇవ్వాలనే డిమాండ్ ను వినిపిస్తున్నారు.ఇక ఈ విషయంలో టిడిపి అధినేత చంద్రబాబు సానుకూలంగానే ఉన్నారు.
బిజెపి ఆయనకు టికెట్ నిరాకరించినా, ఆయనను టిడిపిలో చేర్చుకుని ఆయనకు పశ్చిమగోదావరి జిల్లాలో, అందులోనూ నరసాపురం లోక్ సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ సీటును కేటాయించాలనే ఆలోచనకు వచ్చినట్లు విశ్వసినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.అయితే ఇప్పటికే టిడిపి తమ పార్టీ తరఫున పోటీ చేయబోయే అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది.ఇంకా విజయనగరం ఎంపీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.అక్కడ రఘురామ కు అవకాశం ఇద్దామని ముందుగా భావించినా, ఉత్తరాంధ్ర నాయకుల నుంచి ఈ విషయంలో వ్యతిరేకత రావడంతో, నరసాపురం ( Narasapuram )లోక్ సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ సీటు కేటాయించే విషయంపై ఆలోచన చేస్తున్నారట.
ఈ క్రమంలో ఉండి నియోజకవర్గం పేరు ప్రస్తావనకు వస్తుంది.ఇప్పటికే అక్కడ టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే గా మంతెన రామరాజు ఉన్నారు.మళ్లీ ఆయనకే సీటు ను ఖరారు చేసింది.అయితే ఇప్పుడు రఘురామ కోసం రామరాజు తో త్యాగం చేయిస్తారా అనేది తేలాల్సి ఉంది.అయితే రఘురామ సైతం ఈ సారి జరిగే ఎన్నికల్లో ఎంపీ గానో, ఎమ్మెల్యే గానో పోటీ చేసి గెలిచి మళ్లీ వైసీపీకి చుక్కలు చూపించాలి అనే లక్ష్యం తో ఉన్నారు.