ఫోన్ ట్యాపింగ్( Phone tapping ) వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది.ఫోన్ ట్యాపింగ్ తో పలువురు అధికారులు అక్రమ ఆస్తులు భారీగా కూడబెట్టుకున్నారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో పలువురు అధికారులపై ఏసీబీ( ACB ) ఫోకస్ పెట్టింది.ఫోన్ ట్యాపింగ్ తో వ్యాపారులు, హవాలా ముఠాల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు.
ఫోన్ ట్యాపింగ్ పోలీసు అధికారుల చిట్టా అంతా ఉన్నట్లు తెలుస్తోంది.కాగా ఈ కేసులో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును( DSP Praneet Rao ) విచారించిన పోలీసులు మరో ఇద్దరు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.