ప్రస్తుత కాలంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలను పరిశీలించినట్లయితే ఆడ పిల్లలకి బాహ్య ప్రపంచంలోనే కాదు తమ ఇంట్లో కూడా రక్షణ కరువైందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.తాజాగా ఓ వ్యక్తి కట్నకానుకల విషయంలో తన భార్యను చిత్రహింసలకు గురి చేయడమే కాకుండా తన రక్తం పంచుకు పుట్టిన కన్న కూతురి నగ్న ఫోటోలను చూస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న ఘటన తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక నగరంలోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో రాజేష్ కేశ్వాని అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు.అయితే ఇతడికి చిన్నప్పటి నుంచి డబ్బు పిచ్చి బాగా ఎక్కువగా ఉండేది.
దీంతో తన సంపాదిస్తున్న డబ్బులు సరిపోక తన భార్యను తరచూ చిత్రహిం`సలకు గురి చేస్తూ అదనపు కట్నం తీసుకురావాలని హింసించేవాడు. దీంతో తన మొదటి భార్య మృతి చెందింది.
ఈ క్రమంలో రాజేష్ తమ కుటుంబ సభ్యుల సలహా మేరకు బంధువుల అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడు.అయితే అప్పటికే రాజేష్ కి ఒక కూతురు కూడా ఉండేది.
అయితే తన రెండో భార్యను కూడా రాజేష్ తరచూ చిత్రహింసలకు గురిచేస్తూ అదనపు కట్నం డబ్బులు తీసుకురావాలని ఒత్తిడి చేసేవాడు.
దీంతో తన కుటుంబ పరువు ప్రతిష్టల గురించి ఆలోచించినటువంటి అతడి భార్య ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులతో చెప్పకుండా మౌనంగా భరించేది.
అయితే ఇటీవలే రాజేష్ మొదటి భార్య కూతురు నగ్న ఫోటోలు అతడి ల్యాప్ టాప్ లో ఉండడాన్ని గమనించింది. దీంతో వెంటనే ఆమె తన కూతుర్ని వెంటబెట్టుకొని దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఈ విషయంపై ఫిర్యాదు చేసింది.
దీంతో రంగంలోకి దిగిన టువంటి పోలీసులు వెంటనే రాజేష్ అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నేరం ఒప్పుకున్నాడు.