శ్రీవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు మంత్రి గంగుల కమలాకర్.ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో మంత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నరు.
కరీంనగర్ లో టీటీడీ అధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణానికి పది ఎకరాల స్థలం సీఎం కేసిఆర్ కేటాయించారని అన్నారు.కాంగ్రెస్ బీజేపీ పార్టీలు టిఆర్ఎస్ పై నిందలేయడం ఆనవాయితీ అని, తెలంగాణ ప్రజలు కెసిఆర్ ను ఒక ఆస్తిగా భావిస్తారని, మూడో సారి టిఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని గంగుల కమలాకర్ ధీమా వ్యక్తం చేశారు.