మెహ్రీన్. తెలుగులో చలాకీ హీరోయిన్.ఈమె సినీ కెరీర్ చాలా కొత్తగా ముందుకు సాగుతోంది.కెరీర్ తొలినాళ్ల నుంచి ఆటు పోట్లను ఎదుర్కొంటూనే ఉంది.కొన్ని సినిమాలు మంచి హిట్లను అందించినా.తనకు పెద్దగా అవకాశాలు రావడం లేదు.
ఇక ఈ అమ్మడు కెరీర్ కు ఫుల్ స్టాప్ పడ్డట్లే అనుకున్న ప్రతి సమయంలోనూ మళ్లీ మంచి అవకాశాలను అందుకుంటూ ఆశ్చర్య పరుస్తుంది.నటనలో టాలెంట్ కంటే గ్లామర్ షోకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ముందుకుసాగుతోంది.
అటు వచ్చిన అవకాశాలను బాగా క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.వాస్తవానికి ఈమె తెలుగులో కెరీర్ మొదలు పెట్టి నాలుగు సంవత్సరాలు అవుతుంది.
కానీ చెప్పుకోదగ్గ స్థాయిలో ఈమెకు అవకాశాలు రాలేదు.అయితే తన కెరీర్ ను ఎప్పుడూ బిజీగా ఉంచుకునేందుకు మాత్రం ఈ బబ్లీగర్ల్ ప్రయత్నిస్తూనే ఉంది.
టాలీవుడ్ లో అవకాశాలు తగ్గుతున్నాయి అని తెలియగానే తమిళంలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుంది.అక్కడ సినిమాలు చేస్తూ ఇక్కడి దర్శకులతో టచ్ లో ఉంటుంది.చిరవకు అవకాశాలను దక్కించుకుంటుంది.చిన్న సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ప్రస్తుతం మీడియం రేంజ్ సినిమాలను చేస్తుంది.
తక్కువ కాలంలోనే మంచి ఫామ్ లో ఉన్న యంగ్ హీరోల సరసన నటించింది.ప్రస్తుతం తెలుగు, తమిళంలో అవకాశాలు తగ్గినట్లు గుర్తించిన ఈ అమ్మడు కన్నడలో అవకాశాల కోసం ట్రై చేస్తుంది.
కన్నడ నాట కూడా ఈ క్యూట్ బ్యూటీకి పలు అవకాశాలు వస్తున్నాయి.అక్కడ మళ్లీ పరిస్థితి అటు ఇటు అయ్యే సరికి తమిళంలోనో, తెలుగులోనో మళ్లీ చాన్సులు పట్టుకునే అవకాశం ఉంది.మొత్తంగా ఈ అమ్మడు నటించిన మంచి రోజులు వచ్చాయి.సినిమాకు డబ్బులు మాత్రం అంతగా రాలేదు. దర్శకుడు మారుతి తెరకెక్కించిన సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో కథ పెద్దగా లేకపోవడంతో ఫ్లాప్ అయ్యింది.దీంతో మళ్లీ తనకు తెలుగులో అవకాశాలు తగ్గే అవకాశం కనిపిస్తోంది.
అందుకే కన్నడ నాట తన లక్ ను పరీక్షించుకుంటుంది.అక్కడైనా మంచి అవకాశాలు అందుకుంటుందేమో చూడాలి.
ఇక ఒక సమయంలో పెళ్లి కూడా చేసుకొని కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంది మెహ్రీన్.కానీ ఆ పెళ్లి కాస్త ఆగిపోవడం తో మల్లి సినిమాల వైపే మెహ్రీన్ తొంగి చూస్తుంది.
ఒక్క సరైన హిట్ లేకపోయినా ఎప్పుడు ఎదో ఒక సినిమాతో జనాలను పలకరిస్తూ మెహ్రీన్ బాగానే కూడబెట్టుకుంటుంది.