కొణిదెల శ్రీజ ( Konidela Sreeja ) అంటే తెలియని ఇండస్ట్రీ జనాలు ఉండరు.ఈమె ఇండస్ట్రీలో ఎలాంటి హోదాలో ఉండకపోయినప్పటికీ మెగాస్టార్ చిరంజీవి ద్వారా ఎంతో ఫేమస్ అయింది.
చిరంజీవి ( Chiranjeevi ) చిన్న కూతురు శ్రీజ అంటే తెలియని వారు ఉండరు.ఇక ఒకప్పుడు శ్రీజ కూడా హీరోయిన్ అవుదామని ఎంతగానో ట్రై చేసిందట.
ఈ విషయంలో సురేఖ కూడా ఫుల్ సపోర్ట్ చేసినప్పటికీ సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుందో చిరంజీవికి తెలుసు.కాబట్టి హీరోయిన్ అవ్వాలి అనే ఆశలు ఏమైనా ఉంటే మర్చిపోండి అని వార్నింగ్ ఇచ్చారట.
దాంతో శ్రీజ ఇండస్ట్రీకి దూరంగా ఉంది.
మొదట్లో ఓ వ్యక్తి ని ప్రేమించి ఇంట్లో వాళ్లకు చెప్పకుండా లేచిపోయి పెళ్లి చేసుకొని ఒక బిడ్డ పుట్టాక అభిప్రాయ బేధాలు వచ్చి విడిపోతే మళ్ళీ చిరంజీవి వెళ్లి తీసుకొని వచ్చి చేరదీసాడు.ఇక రెండోసారి చిరంజీవి బంధువుల అబ్బాయిని చూసి పెళ్లి చేస్తే వీరికి కూడా ఒక అమ్మాయి పుట్టాక ఈ మధ్యకాలంలో విడాకులతో దూరమయ్యారు.అయితే శ్రీజ ( Sreeja ) గురించి తాజాగా సోషల్ మీడియాలో మరో వార్త చక్కర్లు కొడుతుంది.
అదేంటంటే తాజాగా ఓ వ్యక్తితో ఉన్న ఫోటోలు శ్రీజా ( Konidela Sreeja )తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.ఇక ఈ ఫోటో చూసినా చాలామంది నెటిజన్లు శ్రీజ మూడో పెళ్లి చేసుకోబోయేది ఈ వ్యక్తినే అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇక అసలు విషయం ఏమిటంటే.శ్రీజ తాజాగా జిమ్ లో వర్కౌట్ లు చేస్తున్న ఫోటోలు వీడియోలు నెట్టింట్లో షేర్ చేసింది.ఇక తన జిమ్ ట్రైనర్ శ్రీజ కి ఎన్నో రకాల కసరత్తులను నేర్పిస్తున్నారు.ఇక చివరిగా ఆ వ్యక్తితో కలిసి ఉన్న ఫోటోతో ఆ వీడియోని ఎండ్ చేసింది.
అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు నెట్టింట్లో హల్చల్ చేయడంతో చాలామంది రకరకాలుగా స్పందిస్తున్నారు.ఓ నెటిజన్ అయితే భర్తను వదిలేసి వర్కౌట్లు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నావా అని అంటే ఇంకొక నెటిజన్ అయితే క్రేజీ గా శ్రీజ మూడో పెళ్లి చేసుకోబోయేది ఈ వ్యక్తినేనా ఏంటి అంటూ కామెంట్ పెట్టాడు.
ప్రస్తుతం ఆ నెటిజన్ పెట్టిన కామెంట్ వైరల్ అవ్వడంతో శ్రీజ మూడో పెళ్లి మేటర్ మరోసారి తెరమీద హాట్ టాపిక్ అయింది.