క్యాలీఫ్లవర్ లో పొగాకు గొంగళి పురుగుల నివారణకు చర్యలు..!

Measures To Prevent Tobacco Caterpillars In Cauliflower , Cauliflower, Prevent Tobacco, Caterpillars , Nomuria Relayii, Cerrasia, Molasses

క్యాలీఫ్లవర్( Cauliflower ) పంట సాగుకు పొగాకు గొంగళి పురుగుల( Caterpillars ) బెడద చాలా అధికంగా ఉంటుంది.ఈ పురుగులు బూడిద, గోధుమ రంగు లో ఉండి అంచుల భాగంలో తెల్లటి గుర్తులు కలిగి ఉంటాయి.

 Measures To Prevent Tobacco Caterpillars In Cauliflower , Cauliflower, Prevent T-TeluguStop.com

ఆడ పురుగులు పొదిగిన తర్వాత ఆకు పచ్చని లార్వాలు త్వరగా విడిపోయి క్యాలీఫ్లవర్ ఆకులను తినడం ప్రారంభిస్తాయి.క్యాలీఫ్లవర్ లో నారింజరంగు పట్టి మచ్చలు మద్యం భాగంలో కనిపిస్తాయి.

ఈ లార్వాలు పగటి సమయాలలో నేలలో ఉండి, రాత్రి సమయాలలో క్యాలీఫ్లవర్ ఆకులను ఆహారంగా తీసుకుంటాయి.తక్కువ తేమ, అల్ప ఉష్ణోగ్రతలు ఉంటే కచ్చితంగా ఈ పురుగులు పంటను ఆశిస్తాయి.

Telugu Agriculture, Caterpillars, Cauliflower, Cerrasia, Latest Telugu, Molasses

ఈ పురుగులు పంటను ఆశిస్తే ఆకులు రాలిపోవడంతో తీవ్ర నష్టం ఎదుర్కోవలసి ఉంటుంది.ఆకుల మధ్య భాగంలో ఇవి గుడ్లు పెట్టి సమూహాలు ఏర్పరచుకుంటాయి.తర్వాత క్రమంగా ఆకుల కణజాలాన్ని పూర్తిగా తినేస్తాయి.తేలికైన నేలలలో ఈ పురుగుల తీవ్రత అధికంగా ఉంటుంది.క్యాలీఫ్లవర్ సాగు చేస్తున్న పొలంలో అక్కడక్కడ పొద్దు తిరుగుడు, జొన్న, ఆముదం లాంటి మొక్కలు నాటుకోవాలి.అంతేకాకుండా పొలంలో అక్కడక్కడ లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి.

డ్రాప్ మొక్కల నుండి పురుగుల గుడ్లను మరియు లార్వాలను తొలగించి నాశనం చేయాలి.పొలంలో ఎప్పటికప్పుడు కలుపు నివారణ చర్యలు చేయాలి.

Telugu Agriculture, Caterpillars, Cauliflower, Cerrasia, Latest Telugu, Molasses

ముందుగా ఈ పురుగులను గుర్తిస్తే సేంద్రీయ పద్ధతిలో నివారణ చర్యలు చేపట్టాలి.ఒకవేళ ఈ పురుగుల తీవ్రత అధికంగా ఉంటే ఆ సమయంలో రసాయన పిచికారి మందులను ఉపయోగించాలి.నోమురియా రిలేయి, సేర్రాషియ ( Nomuria relayii, Cerrasia )మార్చే స్క్రీన్స్ లను క్యాలీఫ్లవర్ ఆకులపై పిచికారి చేయాలి.వరి ఊక, మొలాసిస్, గోధుమ చక్కెర లాంటి ఎర్ర ద్రావణాలను సాయంత్రం వేళలో నేలపై వేసి ఈ పురుగులను అరికట్టాలి.ఇక రసాయనిక ఎరువులైన క్లోరోపైరీఫాస్ 2.5 మిలీ, ఎమామీక్టిన్ 0.5గ్రా, క్లోరంత్రనిలిప్రోల్ 0.3గ్రా లలో ఏదో ఒక పిచికారి మందులో నీటిని కలిపి పంటకు పిచికారి చేయాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube