స్టార్ హీరో రామ్ చరణ్( Ram Charan ) అంటే ఇష్టపడని వారు దాదాపుగా ఉండరనే సంగతి తెలిసిందే.రామ్ చరణ్ వివాదాలకు దూరంగా, కూల్ గా ఉండటానికి ప్రాధాన్యత ఇస్తారు.
సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకి ప్రాధాన్యత ఇచ్చే హీరోగా చరణ్ కు పేరుంది.కెరీర్ తొలినాళ్లలో లుక్స్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్న చరణ్ తర్వాత రోజుల్లో బెస్ట్ లుక్స్ తో ఆశ్చర్యపరిచారనే చెప్పాలి.
తుఫాన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో విమర్శలు మూటగట్టుకున్న రామ్ చరణ్ తర్వాత రోజుల్లో ఆర్.ఆర్.ఆర్ సినిమాతో( RRR ) తనపై వచ్చిన విమర్శలకు గట్టిగా బదులిచ్చారు.ప్రముఖ నటి మానుషి చిల్లర్( Manushi Chillar ) రామ్ చరణ్ పై ప్రశంసల వర్షం కురిపించగా ఆ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఆపరేషన్ వాలంటైన్( Operation Valentine ) అనే సినిమాతో మానుషి చిల్లర్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.ఈ సినిమా ఫ్లాప్ కావడంతో మానుషి చిల్లర్ కు తెలుగులో పెద్దగా ఆఫర్లు రాలేదు.
మానుషి చిల్లర్ మాజీ ప్రపంచ సుందరి కాగా చరణ్ గురించి ఈ బ్యూటీ మాట్లాడుతూ చరణ్ కు జోడీగా నటించే అవకాశం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు.రామ్ చరణ్ యాక్టింగ్ స్కిల్స్ కు తాను వీరాభిమానినని ఆమె అన్నారు.చరణ్ అద్భుతంగా డ్యాన్స్ చేయగలరని చరణ్ డ్యాన్స్ నాకెంతో నచ్చుతుందని మానుషి చిల్లర్ పేర్కొనడం గమనార్హం.
చరణ్ కు జోడీగా ఒక్క సినిమాలో అయినా నటించాలని చాలారోజుల నుంచి కలలు కంటున్నానని ఆమె పేర్కొన్నారు.తెలుగులో నా నెక్స్ట్ మూవీ రామ్ చరణ్ తో ఉండాలని మానుషి చిల్లర్ కామెంట్లు చేశారు.ఈ కామెంట్లు స్టార్ హీరో రామ్ చరణ్ దృష్టికి వస్తే చరణ్ ఆమెకు అవకాశం ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని చెప్పవచ్చు.