లిక్కర్ స్కాం ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) జ్యుడీషియల్ కస్టడీ ఇవాళ్టితో ముగియనుంది.మార్చి 15వ తేదీన కవిత అరెస్ట్ కాగా ఈడీ, సీబీఐ కేసుల్లో రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue Court ) జ్యుడీషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే.

 Inquiry On Mlc Kavitha Bail Petition In Liquor Scam Ed Case Details, Brs Mlc Kav-TeluguStop.com

ఎమ్మెల్సీ కవితను వర్చువల్ గా కోర్టు ఎదుట హజరుపరచనున్నారు.ఈ క్రమంలో కవితకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని ఈడీ, సీబీఐ న్యాయస్థానాన్ని కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదేవిధంగా ఈడీ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై( Kavitha Bail Petition ) కూడా ఇవాళ విచారణ జరగనుంది.ఈ పిటిషన్ పై ఇప్పటికే విచారణ జరిపిన ధర్మాసనం మరోసారి వాదనలు విననుంది.

మరోవైపు సీబీఐ కేసులో బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి.బెయిల్ ఇస్తే కవిత కేసును ప్రభావితం చేయగలరని సీబీఐ పేర్కొంది.

ఈ క్రమంలో ఇరు పక్షాల వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube