సినిమా సెలబ్రిటీల జీవితాలు పైకి కనిపించినంత అందంగా ఉండవు.సిల్వర్ స్క్రీన్ పై నవ్వుతూ కనిపించే ఎంతోమంది సెలబ్రిటీల నిజ జీవితంలో ఎన్నో విషాదాలు ఉంటాయి.
ఈ మధ్య కాలంలో సినిమాల ద్వారా, సీరియళ్ల ద్వారా, వెబ్ సిరీస్ ల ద్వారా మణిబామ్మ( Manibamma ) ప్రేక్షకులకు ఎంతో దగ్గరవుతున్నారు.ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన మణిబామ్మ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
నేను బీఎస్సీ బీఈడీ చదువుకున్నానని పెళ్లి తర్వాత డిగ్రీ చేశానని ఆమె తెలిపారు.నేను స్కూల్ లో టీచర్ గా ( School Teacher ) పని చేస్తున్న సమయంలో అక్కాయ్ టీచర్ అని అందరూ పిలిచేవారని ఆమె చెప్పుకొచ్చారు.
నా పూర్తి పేరు కానూరి లక్ష్మీ కాంతమణి( Kanuri Lakshmi Kantamani ) అని మణిబామ్మ కామెంట్లు చేశారు.పిల్లల్ని బాగా కొట్టేదానినని ఆమె పేర్కొన్నారు.పిల్లల్ని బాగా భయపెట్టేదానినని మణిబామ్మ వెల్లడించడం గమనార్హం.
నాకు ఇద్దరు అబ్బాయిలు అని ఒక అబ్బాయి దేవుడి దగ్గరకు వెళ్లిపోయాడని కోడలు ముందు చనిపోయిందని ఆమె తెలిపారు.కొడుకు అబ్బాయిని నేను చదివించుకుంటూ ఉన్నానని మణిబామ్మ అన్నారు.నా భర్త కూడా చనిపోయారని మూడున్నర సంవత్సరాల గ్యాప్ లో మూడు విషాదాలు చోటు చేసుకున్నాయని ఆమె కామెంట్లు చేశారు.
ముగ్గురి మరణాలను తలచుకుంటూ మణిబామ్మ పేర్కొన్నారు.
నేను పిల్లలకు ఎక్కువగా తెలుగు( Telugu ) చెప్పేదానినని ఆమె వెల్లడించారు.మణిబామ్మ కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.మణిబామ్మ నటనకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.
మణిబామ్మ పారితోషికం( Manibamma Remuneration ) పరిమితంగా ఉంది.ఈటీవీలో ప్రసారమవుతున్న పలు షోలలో ఆమె సందడి చేస్తున్నారు.
మణిబామ్మ కామెడీ టైమింగ్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.నటి మణిబామ్మ కెరీర్ పరంగా ఎన్నో విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.