ఈ మధ్య కాలంలో కేవలం సినిమాలో నటించే క్యాస్టింగ్ ద్వారానే ఊహించని స్థాయిలో అంచనాలు ఏర్పడిన సినిమా ఏదనే ప్రశ్నకు కన్నప్ప సినిమా( Kannappa Movie ) పేరు సమాధానంగా వినిపిస్తుంది.ఈ సినిమాలో ప్రభాస్ ( Prabhas ) శివుని పాత్రలో కనిపించనున్నారని వార్తలు వైరల్ అయ్యాయి.
అయితే వైరల్ అవుతున్న వార్త నిజం కాదని తెలుస్తోంది.కన్నప్ప సినిమాలో ప్రభాస్ కనిపిస్తారని అయితే ఆ పాత్ర శివుని పాత్ర కాదని భోగట్టా.
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్( Sivaraj Kumar ) ఈ సినిమాలో శివుడి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.ఇప్పటికే మోహన్ లాల్( Mohan Lal ) ఈ సినిమాలో ఫైనల్ కాగా శివరాజ్ కుమార్ కూడా కనిపించనున్నారని బోగట్టా.
బాలీవుడ్ నటీనటులు కూడా ఈ సినిమాలో కనిపించనున్నారని తెలుస్తోంది.ఈ సినిమా బడ్జెట్ విషయంలో మంచు విష్ణు ఏ మాత్రం రాజీ పడటం లేదని సమాచారం అందుతోంది.
మంచు విష్ణు( Manchu Vishnu ) కన్నప్ప విషయంలో సరైన ప్లానింగ్ తో ముందుకెళుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఇతర హీరోల ఫ్యాన్స్ సపోర్ట్ ఉండటంతో ఈ సినిమా కమర్షియల్ గా భారీ రేంజ్ లో సక్సెస్ సాధించే అవకాశాలు ఉన్నాయి.కేవలం 3 నెలల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యేలా మంచు విష్ణు ప్లాన్ చేస్తున్నారని సమాచారం అందుతోంది.ప్రభాస్ ఈ సినిమాలో ఏ పాత్రలో కనిపిస్తారో చూడాల్సి ఉంది.
మంచు విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ను ఈ సినిమాతో సొంతం చేసుకోవడంతో పాటు ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించే దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.మంచు విష్ణు త్వరలో ఒక ఓటీటీ షో చేస్తానని వెల్లడించగా నిజంగానే ఆ షో చేస్తారో లేదో తెలియాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందే.కన్నప్ప సినిమాలో హీరోయిన్ గా నటించేదెవరనే ప్రశ్నకు సంబంధించి జవాబు దొరకాల్సి ఉంది.