చైల్డ్ ఆర్టిస్ట్ సుహాని కలిత అనగానే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు కానీ తునిగా తునిగా సాంగ్ చైల్డ్ ఆర్టిస్ట్ అనగానే ఇట్టే గుర్తు పట్టేస్తారు.ఆ ఒక్క పాటతో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్రను వేసుకుంది సుహాని కలిత.
మనసంతా నువ్వే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సుహాని కలిత కేవలం చైల్డ్ ఆర్టిస్ట్ గా మాత్రమే కాకుండా పలు సినిమాలలో హీరోయిన్ గా కూడా నటించింది.ఇది ఇలా ఉంటే తాజాగా సుహానికలిత పెళ్లి పీటలు ఎక్కింది.
ఈమె ప్రముఖ సంగీతకారుడు, మోటివేషనల్ స్పీకర్ విభర్ హసీజా ని పెళ్లి చేసుకుంది.కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అయితే మొదట బాల రామాయణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సుహానికలిత ఆ తర్వాత ప్రేమంటే ఇదేరా,గణేష్,మనసంతా నువ్వే, ఎలా చెప్పను వంటి మంచి మంచి సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.తెలుగులో మాత్రమే కాకుండా తమిళం,హిందీ, బెంగాలీ భాషల్లో కూడా అవకాశాలు రావడంతో వరుసగా సినిమాలు చేస్తూ దోచుకుపోయింది సుహాని కలిత.
అంతేకాకుండా ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు పలు రకాల వాణిజ్య ప్రకటనలలో కూడా నటించింది.
2008లో విడుదల అయిన సవాల్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.కానీ హీరోయిన్ గా మాత్రం ఈమె పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.కానీ చైల్డ్ ఆర్టిస్ట్ గా మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అయితే సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.
మొత్తానికి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సుహానికలిత పెళ్లి తర్వాత సినిమాల్లో నటిస్తుందో లేదో చూడాలి మరి.