ఈ మధ్య కాలంలో బయటివాళ్ల కంటే నమ్మినవాళ్లే ఎక్కువగా మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారు.సోషల్ మీడియాను వినియోగించుకొని ఒక మహిళను ట్రాప్ చేసి ఆ తరువాత ఆ మహిళను దారుణంగా రేప్ చేశాడొక దుర్మార్గుడు.
కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి రేప్ చేసిన వీడియోలను బయటపెడతానని బెదిరించి బంగారం, లక్షల రూపాయల నగదు దోచుకున్నాడు.కానీ అంతటితో సంతృప్తి చెందక మహిళను బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేయడంతో మహిళ పోలీసులను ఆశ్రయించింది. పూర్తి వివరాలలోకి వెళితే హైదరాబాద్ లో నివాసం ఉన్న సంజీవ రెడ్డి అమెరికాలోని ఉన్న ఒక మహిళకు ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు.మహిళ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన తరువాత వీళ్లిద్దరి మధ్య స్నేహం కుదిరింది.
ఆ తరువాత సదరు మహిళ హైదరాబాద్ వస్తున్నానని చెప్పడంతో సంజీవ రెడ్డి ఎయిర్ పోర్టుకు వెళ్లి మహిళను రిసీవ్ చేసుకున్నాడు.లంచ్ పేరు చెప్పి ఒక హోటల్ కు రమ్మని మహిళను కోరాడు. మహిళ అంగీకరించి హోటల్ కు రాగా సంజీవ రెడ్డి తన భార్యను, మేనల్లుడిని పరిచయం చేశాడు.హోటల్ లో భోజనం తినటానికి నిరాకరించిన మహిళను కనీసం కూల్ డ్రింక్ అయినా తాగాలని సంజీవ రెడ్డి కోరగా మహిళ అంగీకరించి కూల్ డ్రింక్ తాగింది.
ఆ తరువాత మహిళను రేపి చేసి వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ 50 లక్షల రూపాయలు, 30 తులాల బంగారం సంజీవరెడ్డి దోచుకున్నాడు.ఆ తరువాత కూడా డబ్బులు డిమాండ్ చేయడంతో మహిళ బాచుపల్లి పోలీసులను ఆశ్రయించటంతో పోలీసులు నిందితుడు సంజీవరెడ్డి, అతని భార్య, మేనల్లుడిని అరెస్ట్ చేశారు.