'మజిలీ' మొదటి రోజు కలెక్షన్స్‌  

Majili Movie First Day Collections-majili Movie Collections,naga Chaitanya,samantha

ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన ‘మజిలీ’ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ రూపొందిన నాగచైతన్య, సమంతల మూవీ పాజిటివ్‌ టాక్‌ను దక్కించుకుంది. నాగచైతన్య రెండు విభిన్నమైన గెటప్స్‌ మరియు వేరియేషన్స్‌తో ఈ చిత్రంలో కనిపించాడు. ఇక సమంత మరియు మరో హీరోయిన్‌ కూడా ఈ చిత్రంకు అదనపు ఆకర్షణగా నిలిచారు..

'మజిలీ' మొదటి రోజు కలెక్షన్స్‌-Majili Movie First Day Collections

ఒక మెచ్యూర్డ్‌ కథతో ఈ చిత్రంను రూపొందించిన దర్శకుడు శివ నిర్వాన విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటున్నాడు. ఈ చిత్రం అన్ని ఏరియాల్లో కూడా మంచి వసూళ్లను రాబడుతోంది.

మొదటి రోజు ఈ చిత్రం అన్ని ఏరియాల్లో కలిపి 11.5 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను, 7.08 కోట్ల షేర్‌ను రాబట్టింది. నాగచైతన్య కెరీర్‌లో ఇంత భారీ షేర్‌ను రాబట్టడం చాలా అరుదు.

ఆయన కెరీర్‌లో ఇది చాలా ప్రత్యేకమైన సినిమాగా చెబుతున్నారు. పెళ్లి తర్వాత సమంతతో కలిసి నటించిన సినిమా అవ్వడంతో ఈ చిత్రం చాలా ప్రత్యేకంగా ఉంటుందని మొదటి నుండి వార్తలు వచ్చాయి. అన్నట్లుగానే సినిమా ఈ చిత్రం ఆకట్టుకుంటుంది..

‘మజిలీ’ చిత్రం మొదటి రోజు కలెక్షన్స్‌:

నైజాం : 1.94 కోట్లు

వైజాగ్‌ : 76 లక్షలు.

ఈస్ట్‌ : 28 లక్షలు.

వెస్ట్‌ : 27 లక్షలు.

కృష్ణ : 37 లక్షలు.

గుంటూరు : 67 లక్షలు.

నెల్లూరు : 18 లక్షలు.

సీడెడ్‌ : 75 లక్షలు.

యూఎస్‌ : 88 లక్షలు.

కర్ణాటక : 73 లక్షలు.

ఇతరం : 25 లక్షలు.

మొత్తం: 7.08 కోట్లు