అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన టువంటి అంజి చిత్రంలో ఆడి పాడినటువంటి ముద్దుగుమ్మ నమ్రతా శిరోద్కర్ గురించి తెలియని వారుండరు.అయితే వంశీ సినిమాలో మహేష్ బాబు సరసన నటించి అదే సమయంలో మహేష్ తో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంది నమ్రతా శిరోద్కర్.
అయితే పెళ్లి అయినప్పటినుంచి సినిమాలు పూర్తిగా మానేసి కేవలం తన దృష్టంతా తన కుటుంబం మరియు ఇతర బిజినెస్ ల వైపు మాత్రమే నిలిపింది.దాంతో ఒకవైపు తన కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూ మరోవైపు తన ఆలోచనలతో పలురకాల వ్యాపారాలను విజయవంతంగా నిర్వహిస్తోంది నమ్రత.
అయితే తాజాగా నమ్రతా శిరోద్కర్ బ్యూటిఫుల్ గా ఉన్నటువంటి ఓ ఫోటోని తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా మహేష్ అభిమానులతో పంచుకుంది.ఈ ఫోటోలో నమ్రత బ్లాక్ కలర్ టీ షర్ట్ మరియు జీన్స్ లో కనిపిస్తుంది.
దీంతో మహేష్ అభిమానులు నమ్రత అందానికి ఫిదా అయిపోయి ఆమె పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.అంతేగాక అల వైకుంఠ పురంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పూజా హెగ్డేని చూసి “మేడం సార్, మేడం అంతే” అనే డైలాగ్ ని నమ్రతా శిరోద్కర్ ఫోటోకి వల్లిస్తున్నారు.
అంతేకాక ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో బాగానే వైరల్ అవుతోంది.
అయితే ఇది ఇలా ఉండగా ప్రస్తుతం నమ్రతా శిరోద్కర్ భర్త మహేష్ బాబు మోకాలి గాయం శస్త్ర చికిత్స నిమిత్తమై మహేష్ తో కలిసి అమెరికాలో ఉంటోంది.అయితే ఆగడు చిత్రం షూటింగ్ సమయంలో మహేష్ బాబుకి చిన్న పాటు గాయం అయింది. అయితే అప్పట్లో ఈ గాయం అంతగా భాదించినప్పటికీ ప్రస్తుతం ఈ గాయం కొంతమేర మహేష్ ని తీవ్రంగా కలవరపెడుతోంది.
అందువల్లనే మహేష్ బాబు ఈ గాయానికి చిన్నపాటి శస్త్రచికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.